నేర్చుకుందాం

నరసింహ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. నరసింహ! నిన్నునే నమ్మినందుకు చాల
నెనరు నాయందుంచు నెమ్మనమున
న్ని వస్తువులు నిన్నడిగివేసట పుట్టె
నిఁకనైన ననుఁ గటాక్షింపవయ్య
సంతసంబున నన్ను స్వర్గమందే యుంచు
భూమియందే యుంచు భోగి శయన!
నయముగా వైకుంఠ నగరమందే యుంచు
నరకమందే యుంచు నళిన నాభ!
తే. ఎచట నన్నుంచినను గాని యెపుడు నిన్ను
మఱచి పోకుండ నీ నామస్మరణ నొసఁగు
భూషణ వికాస ! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురిత దూర!

భావం:నరసింహాస్వామీ! నిన్ను నేను నమ్మినాను. నాపై దయ యుంచు. ఇంతదాక పదార్థాలకై నిన్ను వేడి వేడి విసుగు పుట్టింది. ఇకనైనా నన్నుగ్రహించు. నన్ను స్వర్గములో నుంచినా, భూమిలోనే ఉంచినా విచారమేమీ లేదు. వైకుంఠంలో గాని, నరకంలోగాని. ఉంచు ఎక్కడ ఉంచినా ఫరవాలేదు. కాని నీ నామ జపాన్ని మరచిపోకుండా ప్రసాదించు.