Others

నాకు నచ్చిన సినిమా... ఖైదీ నెం.150

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు చిత్రసీమలో దాదాపు రెండు దశాబ్దాల వరకు రైతుల మొర, వారి కృషి, కష్టం గుర్తించిన సినిమా ఒక్కటీ రాలేదు. డేరింగ్, డాషింగ్, డైనమిక్ హీరోగా తెలుగు ప్రేక్షకుల్ని తన సినిమాలతో ఉర్రూతలూగించి, ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘ఖైదీ నెం.150’లో మనకు రైతుల కష్టాలు, కన్నీళ్లు కళ్లెదుట ప్రత్యక్షమయ్యాయి. తొమ్మిది సంవత్సరాల తర్వాత ‘బాస్ ఈస్ బ్యాక్’ అంటూ మళ్లీ వెండితెరపై ప్రత్యక్షం అయిన మెగాస్టార్ చిత్రమిది. చిరంజీవి 150వ సినిమా ఇది. సంక్రాంతి బరిలో ముందొచ్చిన చిత్రం. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ సినిమా తమిళ చిత్రం ‘కత్తి’కి రీమేక్‌గా మన ముందుకొచ్చింది. తమిళంలో వచ్చిన ‘కత్తి’ అక్కడ అనూహ్య విజయం సాధించింది. రీమేక్ అయినప్పటికీ ఈ చిత్రం సినీ జనాల్లో అంచనాలకు మించి ఉత్సాహాన్ని, కుతూహలాన్ని విపరీతంగా పెంచేసింది. ఎందుకంటే అది చిరంజీవి 150 సినిమా కాబట్టి. దర్శకుడు వి.వి.వినాయక్‌తో గతంలో చిరంజీవి చేసిన ‘్ఠగూర్’ ఎంతటి ప్రజాదరణ పొందిందో తెలియంది కాదు. అదే కాంబినేషన్ మళ్లీ పునరావృతం అవడం వల్ల సహజంగానే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. పైగా తనయుడు రామ్‌చరణ్ నిర్మాత కావడం కూడా విశేషమే. కోల్‌కతా సెంట్రల్ జైల్లో కత్తి శీను కనిపించటంతో కథ మొదలవుతుంది. జైలు నుంచి తప్పించుకున్న శీను హైదరాబాద్ వస్తాడు. అక్కడి నుంచి బ్యాంకాక్‌కు వెళ్లే సమయంలో లక్ష్మి (కాజల్)ని చూసి ప్రేమలో పడతాడు. ఫారిన్ వెళ్లాలనుకున్నప్పటికీ లక్ష్మి కోసం ఆగిపోతాడు. ఆ సమయంలో ఒకరిపై హత్యాయత్నం జరగటం.. అతను తనలానే ఉండటంతో ఆశ్చర్యానికి గురి అవుతాడు. తనలా ఉన్న శంకర్ (చిరంజీవి ద్విపాత్రాభినయం)ను కాపాడి ఆసుపత్రిలో చేరుస్తాడు. శంకర్ ఎవరంటే.. రైతుల పక్షాన నిలిచి వారికోసం పోరాడే రైతు నాయకుడు. రైతుల క్షేమం కోసం శంకర్ ఎంతగా తపిస్తాడన్నది తెలియటంతో పాటు అగర్వాల్ కుతంత్రం ఏమిటో అర్థం అవుతుంది. రైతుల పక్షాన నిలిచి.. శంకర్ ఆశయాల్ని అమలు చేయాలని కత్తిశీను అనుకుంటాడు. రైతుల భూముల్ని కాజేయాలనుకున్న అగర్వాల్ కుట్రకు చెక్ పెడుతూ రైతుల పక్షాన నిలిచే ప్రయత్నం చేస్తాడు. దీంతో కార్పొరేట్ సంస్థల అధిపతి అగర్వాల్‌కు, రైతు నాయకుడు శంకర్‌గా మారిన కత్తిశీనుకు మధ్య పోరు మొదలవుతుంది. అగర్వాల్ కుట్రను ఏ విధంగా అడ్డుకున్నాడు? రైతుల పంట భూములు కోల్పోకుండా చేశాడా? అగర్వాల్‌కు చెక్ పెట్టేందుకు కత్తిశీను వేసిన వ్యూహం ఫలించిందా? శంకర్ ఏమయ్యాడు? లక్ష్మీ.. కత్తిశీనుల ప్రేమకథ ఏమైంది? కత్తి శీను ఫారిన్ ప్రయాణం ఏమైంది? అన్నదే సినిమా. వినోదం సందేశం మేళవింపుగా సినిమా రూపుదిద్దుకుంది. కత్తి శీను పాత్ర ఎలా మలుపులు తిరుగుతుంది. అతడికీ, విలన్‌కీ మధ్య ఎలా యుద్ధం జరుగుతుంది వంటి వాటిని దర్శకుడు వి.వి.వినాయక్ ఆసక్తికరంగా మలిచాడు. ఒక పక్క కథనం వేగంగా సాగుతుండగానే అలరించే పాటలూ, రైతుల పరిస్థితిని కళ్లకు కట్టే సన్నివేశాలూ, కామెడీ పంచ్‌లూ వరుస కడతాయి. ఇది ‘కత్తి’ రీమేక్. అయితే చిరంజీవి రేంజ్‌కి తగ్గట్టుగా పాటల్నీ, ఫైట్స్‌నీ బాగా చిత్రీకరించారు. అన్నీ కొత్తగా అనిపించాయి. చివరికి రైతులు గెలిచి తమ భూములను తాము స్వాధీనం చేసుకోవడం లాంటి సన్నివేశాలు ఆసక్తికరంగా మలిచారు దర్శకుడు. మొత్తం మీద తొమ్మిదేళ్ల తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన చిరంజీవి మునుపటిలాగానే తన నటనతో రెండు పాత్రల్ని పండించారు. డాన్సుల్లోనూ ఒకప్పటి హుషారు కనిపించింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, రత్నవేలు ఫొటోగ్రఫీ బాగున్నాయి.

-వెంకట్ తాల్క, తార్నాక, సికింద్రాబాద్