ఉత్తరాయణం

విజన్-2022

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంవత్సరం:2022
ప్రాంతం: అమెరికాలోని కేంటుకి రాష్ట్రం
పాత్రలు: ఓ అమెరికన్ కుటుంబం
‘‘డాడీ.. మంచి మార్కులొస్తే నాకు బిఎఫ్‌సి ట్రీట్ ఇస్తానన్నారు, మరిచిపోయారా?’’
‘‘నో కిడ్.. అంత డబ్బు లేదు ప్రస్తుతం నా వద్ద. అందాకా కెఎఫ్‌సి ఇవ్వనా!’’’
‘‘నో డాడ్! గ్రేట్ డిప్రెషన్ టైంలో కల్నల్ సాండర్స్ తాతయ్య ఇక్కడ మొదలెట్టిన ఆ ‘్ఫడ్ చైన్ స్టోర్’ ఇప్పుడు తానే డిప్రెషన్‌లోకి పోయింది. ఇప్పుడంతా బిఎఫ్‌సి నడుస్తోంది. అఫ్‌కోర్స్.. వెరీ కాస్ట్లీ’’.
‘‘ఐ నో కిడ్.. ది ఇండియన్ బిఎఫ్‌సి. ఐమీన్ ‘్భరత్ ఫ్రెష్ పకోడీ చైన్’ మొత్తం గ్లోబ్ లాగేసుకొంది. డామిట్. నో స్పేస్ ఫర్ అదర్ స్నాక్ ప్రాంచైస్’’.
‘‘ఆ ఇండియన్స్ వాళ్ళ ప్రొడక్ట్ అక్కడే అమ్ముకోవచ్చు కదా డాడ్. మనకి అలవాటు చేసి మన మార్కెట్ ఎందుకు కొట్టేయడం?’’
‘‘యూ నో.. అక్కడి ప్రధాని పిలుపు మేరకు అందరూ అక్కడ తయారుచేయడం మొదలుపెట్టారుట. ఇక కొనేవాళ్ళు లేక ఇబ్బంది వచ్చిందట. ఇక లాభం లేదని ఎక్స్‌పోర్ట్ వ్యూహం అమలు చేసారట. అక్కడ జిడిపిలో సగం జీడిపప్పుపకోడీ సంపాదిస్తుంది తెలుసా?’’
‘‘అక్కడ అంత తక్కువ జిడిపీయా?’’
‘‘యూ సిల్లీ! చైనాకన్నా ఎక్కువ. ఇన్‌ఫాక్ట్ చైనా బెదిరిపోయి పకోడీకి పోటీగా ఫేక్ కోడి అని డూప్లికేట్ దించితే, పాకిస్తాన్ పాక్-కోడి అని మార్కెట్‌లోకి దించింది. అవేవీ పకోడీలో ఉల్లిరెక్కను కూడా పీకలేకపోయాయి’’.
‘‘మీ నోరూరించే కబుర్లు తర్వాత.. ట్రీట్ ఎప్పుడో చెప్పండి’’.
***
‘‘మిట్ట మధ్యాహ్నం ఏమిటా నిద్ర? ఇక లేవండి’’ అన్న మా ఆవిడ పిలుపుతో నాకు మత్తు వదలింది. షా, మోదీ జోడీ వేడి వేడి పకోడీపై చేస్తున్న వాడి వేడి చర్చలు విని కునుకేస్తే ఈ పగటి కల వచ్చిందన్నమాట. అదేమాట చెప్పాను.
‘‘బాగా గుర్తుచేశారు. ఓ ప్లేట్ పకోడీ చెయ్యండి.. తినాలని అనిపిస్తోంది.’’
నేను కదలకపోయేసరికి మళ్లీ గదమాయించింది మా ఆవిడ. కాంగ్రెస్ వాళ్ళని అమిత్ షా గదమాయించినట్టు.
‘‘పకోడీ చెయ్యడం నామోషీ కాదు. మీరు కథలు రాయడం కన్నా గొప్ప పని. మీరు కథలు రాసి పేపరేస్తే, వాటికన్నా ఆ పేపరు పొట్లంలోని పకోడీలే బాగుంటాయి తెలుసా?’’
‘‘నామోషీ ఏమిటి? దానికి, దీనికి పోలికేమిటి? దేనికదే గొప్ప! ఇలా కంపేర్ చెయ్యడం బాగులేదు. నువ్వయినా, ఈ దేశ ప్రధాని అయినా..’’ సణుగుతూ కిచెన్ వైపు నడిచాను.
‘‘ఇదుగో, ఉల్లిపాయల ధరలు పెరిగాయి. వాడకండి. గ్యాసు, ఆయిల్ ధరలు కూడా.. అట్టే వేస్ట్ చేయకండి’’.
సాయం లేకపోయినా దేశంలో ఉపదేశాలకు లెక్కలేదు.

-డా డి.వి.జి. శంకరరావు