జాతీయ వార్తలు

ఆధార్ కోసం సతాయించకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: ఆధార్ కార్డు లేదన్న కారణంతో ఏ లబ్ధిదారునికి సంక్షేమ పథకాలు అందకుండా నిరాకరించ వద్దని కేంద్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. అర్హులైన అందరికీ సంక్షేమ ఫలాలు దక్కాల్సిందేదని, ఆధార్ సాకుతో తిరస్కరించ వద్దని కేంద్ర న్యాయ, ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆదేశించారు. రాజధాని ఢిల్లీలో జరిగిన రాష్ట్రాల ఐటీ మంత్రుల సమావేశంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ ‘సుపరిపాలన కోసం ఆధార్‌ను ఓ వేదికగా చేసుకుని పనిచేయాలి. పొదుపు కార్యక్రమాలకు దానే్న ప్రామాణికంగా తీసుకోవాలి. అలాగని లబ్ధిదారులు ఆధార్ వివరాలు అందించలేదన్న కారణం చూపి పథకాలు నిరాకరించవద్దు’ అని అన్నారు. సంక్షేమ పథకాల ప్రయోజనాలన్నీ అర్హులకు అందాల్సిందేనని ప్రసాద్ స్పష్టం చేశారు. ‘చౌక డిపోల్లో రేషన్ నిరాకరించిన సంఘటనలు అనేక జరిగాయి. ఇకముందు అలా జరగడానికి వీల్లేదు. ఓసారి దీనిపై ఆలోచించండి. అర్హులైన ఏ ఒక్క లబ్ధిదారుడు నష్టపోకూడదు. రేషన్ ఇవ్వకుండా నిరాకరించకూడదు’ అని ఆయన వివరించారు. పేదలకు సంక్షేమ ఫలాలు అందాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఆధార్ కార్డు తీసుకురాలేదన్న కారణంతో గుర్గావ్‌లో ఓ ఆసుపత్రిలో గర్భిణీకి వైద్య సేవలు అందించడానికి నిరాకరించగా ఆమె బయటే ప్రసవించింది. దేశ వ్యాప్తంగా ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. బయోమెట్రిక్ పనితీరుపై ఆయన మాట్లాడుతూ కొన్నిచోట్ల వయోవృద్ధుల వేలిముద్రలు ఆధార్‌తో సరిపోలడం లేదన్న కారణంతోనూ రేషన్ నిరాకరిస్తున్నట్టు వార్తలొచ్చాయని మంత్రి అన్నారు. అలాంటి సందర్భాల్లో ఆధార్ నంబర్‌ను ఓ రిజిస్టర్‌లో నమోదు చేసుకుని సరుకులు అందించాలని సంబంధిత శాఖలను ఆయన ఆదేశించారు. ఎవరైనా ఆధార్ కార్డు మరిచిపోయి వస్తే అదేపనిగా వత్తిడి చేయకుండా మరో ప్రత్యామ్నాయ మార్గాల్లో వారికి లబ్ధి చేకూర్చాలని ఆయన తెలిపారు.
chitram...
ఢిల్లీలో మంగళవారం జరిగిన రాష్ట్రాల ఐటీ మంత్రుల సమావేశంలో
పాల్గొన్న కేంద్ర న్యాయ, ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్