జాతీయ వార్తలు

బీసీల క్రీమీలేయర్ ఎత్తివేయాలి: వీహెచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: దేశవ్యాప్తంగా బీసీ రిజర్వేషన్లలో అమలవుతున్న క్రీమీలేయర్‌ను ఎత్తివేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీ హనుమంతరావు డిమాండ్ చేశారు. మంగళవారం హనుమంతరావు విలేఖరులతో మాట్లాడుతూ క్రీమీలేయర్ కారణంగా బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. క్రీమీలేయర్ మూలంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో తొమ్మిది శాతానికి రిజర్వేషన్లు మించడం లేదని అన్నారు. క్రీమీలేయర్ తొలగించాలని, ఎవరికీ లేనటువంటి క్రీమీలేయర్ విధానం బీసీలకే ఎందుకని ఆయన ప్రశ్నించారు. క్రీమీలేయర్ ఎత్తివేసే విధంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి వారికి సమస్యను వివరిస్తానని పేర్కొన్నారు. దీనిపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల చేత కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ విధానం ఎత్తి వేయకుంటే, దేశవ్యాప్తంగా బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు దక్కకుండా పోతాయని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీకి గతంలో పనిచేసిన ముఖ్యమంత్రులు ఏ కులానికి చెందినవారో తెలియకుండా పార్లమెంట్‌లో మాట్లాడుతున్నారని విహెచ్ మండిపడ్డారు.
కాంగ్రెస్, బీజేపీ
రెండూ ప్రమాదకరమే
భావసారూప్యత కలిగిన పార్టీలన్నీ ఏకం కావాలి: సీపీఎం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే వామపక్ష కూటమితోపాటు భావసారూప్యత కలిగిన పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని సీపీఎం తీర్మానించింది. కాంగ్రెస్‌తో ఎలాంటి ఎన్నికల పొత్తుగాని, అవగాహన లాంటివి లేకుండానే మిగతా పార్టీలతో కలిసి ఎన్డీయేను ఎదుర్కోవాలని నిర్ణయించింది. ఈ మేరకు సీపీఎం ఒక తీర్మానాన్ని ప్రతిపాదించింది. అందులో మతతత్వ శక్తులను ఎదుర్కోవాలంటే ఇది తప్పనిసరి అని తెలిపింది. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలూ ప్రమాదకరమైనవేనని, అందుకే ప్రజాస్వామ్య భావసారూప్యత కలిగిన పార్టీలతో చేతులు కలపాలని తీర్మానం పేర్కొంది.