ఐడియా

కొనుక్కుంటే వచ్చేవి కావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవించేందుకు డబ్బు అవసరమే. కాని డబ్బు ఉంటేనే జీవిస్తామని భ్రమపడకూడదు. ప్రేమ, అప్యాయత, అనురాగం, సంతోషం ఇట్లాంటివి డబ్బుతో కొనుక్కోవచ్చు అనుకొంటే పొరపాటే. సత్యసాయి భగవాన్ చెప్పినట్లు ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ ద్వేషం, కోపం, ఈర్ష్య అనేవాటికి చోటు ఉండదు. మనిషి సంతోషంగా, సుఖంగా, ఆనందంగా జీవించేందుకు ప్రేమనే మంచి ఔషధం. కొంతమంది ప్రతి చిన్న విషయానికి కూడా కోపగించుకుంటూ ఉంటారు. ఎదుటివారిపై తమ మనస్సులో ద్వేషం, ఈర్ష్య నింపుకుంటారు. దాంతో వారు ఆనందంగా ఉండలేరు. ఎదుటివారిని సంతోషంగా జీవించనివ్వరు.
ఇంకొంతమంది ఎంతటి ఒత్తిడి లోనైనా, మిన్ను విరిగి మీదపడినా తమ ముఖంలో ప్రశాంతతను చెదరనివ్వరు. చిరునవ్వును చిందిస్తూనే ఉంటారు. ఎదుటివారికి ఎప్పటిలాగా ప్రేమాప్యాయతలే పంచుతుంటారు. ఎవరైనా వారిని విమర్శించినా, దూషించినా అందులో సత్యమెంతో అని చూస్తారు. నిజముంటే మారడానికి ప్రయత్నం చేస్తారు. ఇట్లాంటి ఉన్నత స్థితి కోసం మనమూ ప్రయత్నిద్దాం.
..............................
మాతృభూమికి రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003