మెయిన్ ఫీచర్

అడుగులకు తొలిమెట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశంలో సాంఘిక విప్లవ యుగం పద్దెనిమిదవ శతాబ్ది చివరలో ప్రారంభమైంది. దీన్ని అవకాశంగా తీసుకొని క్రిస్టియన్ మిషనరీల వారు కలకత్తా నగర చుట్టుప్రక్కల కొన్ని మిషనరీ పాఠశాలలు స్థాపించారు. అయితే ఇవి మత పరమైన బోధనకే ప్రాముఖ్యమివ్విడంతో ప్రజల్లో ఎక్కువ ప్రచారం పొందలేకపోయాయి. అయితే దీనివల్ల ఒక మేలే జరిగింది. మనం చేయలేని పని విదేశీయులు చేస్తున్నందుకు భారతీయులు కళ్ళు తెరిచారు. ఈ ప్రేరణతో రామ్‌గోపాల్ ఘోష్ అనే యువకుడు ముందుకొచ్చి అక్కడక్కడ కొన్ని పాఠశాలలు తెరిచే ప్రయత్నం చేశారు. కానీ ఇవి పాత విధానంలో నడవడంతో ప్రజలను ఎక్కువ ఆకర్షించలేకపోయాయి. బెథ్యూన్ ప్రారంభించిన హిందూ బాలికల పాఠశాలలోనే మన దేశంలో స్ర్తివిద్యకు శ్రీకారం చుట్టినట్లయింది.
సర్ జాన్ ఇల్లియాట్ సింక్ వాటర్ బెథ్యూన్ అనే యువకుడు కేంబ్రిడ్జిలో చదువుకునే రోజుల్లోనే అభ్యుదయవాదిగా పేరు తెచ్చుకున్నాడు. బారిష్టరు పరీక్షలో ఉత్తీర్ణుడై ఈస్టిండియా కంపెనీ కొలువులో ప్రవేశించి ఇండియా కొచ్చాడు. చదువుకునే రోజుల్లోనే స్ర్తివిద్యపై ఎంతో ఆసక్తి కలిగిన బెథ్యూన్‌కు భారతదేశంలో రుూ ప్రయత్నం మొదలుపెట్టాడు.
1848లో బెథ్యూన్ గవర్నరు జనరల్ కౌన్సిల్‌లో న్యాయ శాఖ మంత్రి అయ్యాడు. విద్యకు ప్రత్యేక శాఖ లేకపోవడంవలన విద్యా శాఖని కూడా ఈయనే చూసేవారు. బెథ్యూన్ భారతదేశం రావడంతో ఇక్కడివారికి ఉత్సాహం కలిగింది. ముఖ్యంగా విద్యారంగంలో అప్పటికే ప్రాథమిక కృషి చేస్తున్న రామ్‌గోపాల్ ఘోష్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.
కలకత్తా నగరంలో ఆ రోజుల్లో ఏ మంచి పని చేసినా దక్షిణ రంజన్ ముఖర్జీ సహాయం లభించేది. ఈ సంగతి తెలుసుకున్న బెథ్యూన్ ముఖర్జీ ఇంటికివెళ్లాడు. కానీ ఆయన అక్కడ లేకపోవడంతో నిరాశ కలిగింది. సాక్షాత్ మంత్రిగారే తన ఇంటికి వచ్చాడన్న వార్త ముఖర్జీని ఉక్కిరి బిక్కిరి చేసింది. ఆలస్యం చేయకుండా మంత్రిగారింటికి పోయి, మీరు మా ఇంటికి వచ్చినపుడు తను లేకపోవడానికి బాధపడి క్షమాపణలు కోరాడు. తన విరాళాల చిట్టా బైటపెట్టాడు. అందులో మొదటిది పాఠశాల భవన నిర్మాణానికి ఇరవై మూడు వేల ధర పలికే నాలుగున్నర బీగాల భూమి, భవన నిర్మాణానికి వెయ్యి రూపాయల నగదు తన స్వంత గ్రంథాలయం నుంచి అయిదువేల గ్రంథాలు బహూకరించాడు. అనుకున్నదానికంటే ఎక్కువ సహాయం లభించడంతో బెథ్యూన్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. తలచుకుంటే భారతీయులు ఎంతైనా ఇవ్వగలరనుకున్నాడు.
నూతన పాఠశాల ఏర్పాటుకు అన్ని పనులు పూర్తి అయ్యాయి. 1849 మే 7వ తేదీన 21 మంది విద్యార్థినులతో దక్షిణ రంజన్ ముఖర్జీ గృహంలో పాఠశాల ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంలో బెథ్యూన్ బ్రిటీష్ అధికారులకుగానీ, ముఖ్యమన భారతీయులకు గానీ ఆహ్వానాలు పంపలేదు. ఏ కొత్త పని మొదలుపెట్టినా విమర్శలే తప్ప ప్రశంసలు నోచుకోని దేశంలో ఆ మొట్టికాయలెందు కనుకున్నాడు. పాఠశాలకు విక్టోరియా రాణి పేరు పెట్టాలని బెథ్యూన్‌కు ఉంది. కానీ ఈస్టిండియా కంపెనీ, అధికారులనుంచి అనుమతి దొరకనందుకు ‘హిందూ ఫిమేల్ స్కూల్’ అని పేరు పెట్టాడు.
ఆదిలో ఎన్నో ఇబ్బందులెదురైనాయి. ఛాందసవాదులైన పెద్దలు ఇదేమి వింత అని ముక్కుమీద వేలేసుకున్నారు. ఒక సమయంలో విద్యార్థినుల సంఖ్య కేవలం ఏడుకి పడిపోయింది కానీ బెథ్యూన్ అధైర్యపడలేదు. ఈ బడికి గుర్తింపు లేదని ప్రచారాలు బయలుదేరాయి. ఇదేమైనా ప్రభుత్వ బడా అనే విమర్శలు ఎదుర్కోవడం తప్పలేదు. ఈ సంగతి తెలుసుకున్న బెథ్యూన్ గవర్నర్ జనరల్‌కు రాసి రాష్ట్ర ప్రభుత్వం చేత గుర్తింపు తెప్పించాడు. అప్పుడు విమర్శకుల నోళ్ళు మూతబడ్డాయి.
బెథ్యూన్ స్థాపించబడిన బడి దినదినాభివృద్ధి చెందడంతో ఉన్న స్థలం సరిపోలేదు. దక్షిణ రంజన్ ముఖర్జీ ఇచ్చిన భూమి నగర శివార్లకు దూరంగా ఉండడంతో ఒక సమస్య అయింది. జనసమ్మర్దంగా వున్న కార్నవాలిస్ రోడ్డులో కొంత కంపెనీ భూమి ఖాళీగా ఉండటంతో తన పలుకుబడితో బెథ్యూన్ ముఖర్జీ భూమితో దాన్ని బదలాయింపు చేయించాడు. నూతన భవనానికి బెంగాల్ గవర్నర్ హింటర్ హిట్లర్ శంకుస్థాపన చేశాడు. అనేకమంది విదేశీ ప్రముఖులు పాల్గొన్న రుూ సభలో తన కృషి ఏమీ లేదని తాను చేసింది ఒక ప్రభుత్వోద్యోగి చేసిన సహాయమని, దక్షిణ రంజన్ ముఖర్జీ ఉదార హృదయం ఈ పని పూర్తికావించిందని తన ఉదాత్తగుణం బైటపెట్టాడు.
ఈ పాఠశాల నిర్వహణలో మొదటినుంచి ఆర్థిక ఇబ్బందులే ఎదురైనాయి. బెథ్యూన్ తన జీతం నుంచి నెల నెలా ఎనిమిది వందల రూపాయలు విరాళంగా ఇచ్చేవాడు. ఎంత తక్కువ అనుకున్నా నూతన భవన నిర్మాణానికి నలభై వేలు అవసరమయ్యాయి. ఈఖర్చునంతా బెథ్యూన్ ఒక్కడే భరించాడు. 1850లో పండిత ఈశ్వర చంద్ర విద్యాసాగర్ పాఠశాలకు కార్యదర్శి కావడంతో బెధ్యూన్‌పై భారం కొంత తగ్గింది. బెథ్యూన్‌కు పెళ్లి కాలేదు. సంసార బాదర బందీ లేని ఆయనకు హిందూ బాలికల పాఠశాలే సర్వస్వం అయింది. దేవేంద్రనాధ్ ఠాగూర్, రాజా బాలకృష్ణ బహదూర్ లాంటి పెద్దల సహకారంతో ఈ పాఠశాల 1851 నాటికి ఎనభై మంది విద్యార్థినులతో నవనవలాడింది.
భారత ప్రజల మిత్రుడుగా పేరు తెచ్చుకున్న బెథ్యూన్ ఎక్కువకాలం జీవించలేదు. 1851 ఆగస్టు 12వ తేదీన ఆయన కాలధర్మం చెంచాడు. చనిపోయే నాటికి ఆయన వద్ద 30వేల నగదు నిల్వగా ఉంది. ఆ డబ్బు పాఠశాలకు విరాళంగా ఇచ్చి పోయాడు.
తన మిత్రుడు బెథ్యూన్ స్థాపించిన పాఠశాల ఆర్థికంగా చితికిపోయే స్థితికి వచ్చినపుడల్లా ఆనాటి గవర్నర్ జనరల్ లార్డ్ డెల్హౌజీ, ఆయన సతీమణి ఆర్థికంగా ఆదుకునేవారు. ఒక సందర్భంలో డల్హౌజీ తన స్వంత ఆస్తి నుంచి ఏడు వేలు విరాళంగా ఇచ్చారు. విద్యార్థినులనుంచి ఖర్చులకోసం కొంత ఫీజు రూపంలో డబ్బు వసూలు చేస్తే మిగతా ఖర్చును భరించడానికి తమకు అభ్యంతరం లేదనీ ఈస్టిండియా కంపెనీ గవర్నరు జనరల్‌కు తెలియజేసింది. కానీ డల్హౌజీ దీనికి అంగీకరించలేదు. తన మిత్రుని అభిమతానికి ఇది విరుద్ధమని చెప్పాడు. 1856 మార్చి 6వ తేదీన డల్హౌజీ గవర్నరు పదవి విరమించేనాటికి ఈ పాఠశాల ఖర్చుని భరిస్తూనే ఉన్నాడు. భారత ప్రజల పట్ల ఎంతో కఠిన హృదయుడని మొదటి స్వాతంత్య్ర పోరాటానికి కారకుడైన గవర్నర్ జనరల్ డల్హౌజీ భారత ప్రజలకు ఈ రూపంలో మేలు చేసాడనే సంగతి చరిత్రలో మరుగున పడిపోయింది. ఏమైనా డల్హౌజీ బాలికల సేవను ప్రోత్సహించాడన్న సంగతి మహిళా అభ్యుదయాన్ని కోరేవారు తప్పక జ్ఞాపకం చేసుకోవలసి ఉంది.

- జి.వెంకట రామారావు