జాతీయ వార్తలు

సర్వజన సంక్షేమం భారత్ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: బలమైన దేశం కావాలన్న భారత్ కాంక్ష ప్రపంచ సంక్షేమాన్ని కోరుకునేవే తప్ప, పొరుగు దేశాల ప్రజలను భయపెట్టడానికి కాదని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. వచ్చే మార్చిలో వారంపాటు నిర్వహించే ‘వేదిక్ యాజ్ఞ’కోసం బుధవారం రథయాత్రను కాషాయ జెండా ఊపి ప్రారంభించారు. రథయాత్రలో భాగంగా దేశం నలుమూలల్లోని వివిధ ప్రాంతాల నుంచి మట్టి, జలాలను సేకరిస్తారు. ‘ఇదొక అద్భుత రథయాత్ర’ అని రాజ్‌నాథ్ అన్నారు. ఈ కార్యక్రమం దేశ పునర్నిర్మాణం, సమగ్రత కోసమే తప్ప అధికారంకోసం కాదన్న విషయాన్ని గుర్తెరగాలన్నారు. మార్చి 18-25 వరకూ ఢిల్లీ ఎర్రకోటకు సమీపంలో 1100 మంది రుత్వికులతో వేదిక్ యజ్ఞ మహాక్రతువు నిర్వహణకు రాష్ట్రీయ రక్ష మహాయజ్ఞ సంస్థ తలపెట్టడం తెలిసిందే. దీనికోసం బుధవారం రథయాత్రను రాజ్‌నాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత్ సంపన్న దేశం కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యం కాదని, బలమైన దేశంగానూ ఎదగాలని కోరుకుంటోందన్నారు. ‘్భరత్ బలపడితే పక్క దేశాల్లోని ప్రజలు ఉగ్రవాద భయం లేకుండా ధైర్యంగా ఉంటారు. అలాంటి భరోసా ఇవ్వగల భారత్ ఆవిష్కృతానికే ఈ క్రతువు. ఇందులో మన సంస్కృతిని పరిరక్షించుకునే ప్రయత్నమూ ఇమిడివుంది. మొత్తం భారత్ ‘విశ్వగురు’ కావాలనుకుంటోంది’ అన్నారు. ‘దేశ సమగ్రతను కాపాడుకుంటూనే, ప్రపంచ క్షేమాన్ని కాంక్షించగల స్థాయికి భారత్ ఎదగాలన్నదే ప్రభుత్వ అభిమతం’ అని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. పేదరికం, నిరుద్యోగం, అపరిశుభ్రత, కులపరమైన వివక్షలు లేని భారత్‌ను 2022 నాటికి ఆవిష్కరించాలని ప్రధాని నరేంద్ర మోదీ తహతహలాడుతున్నారని అన్నారు. సంస్కృతీ సంప్రదాయాల పరంగానే కాదు, ఐక్యతతోనూ భారత్ వసుదైక కుటుంబమని చాటి చెప్పడమే వేదిక్ యజ్ఞ ముఖ్య ఉద్దేశంగా రాజ్‌నాథ్ వివరించారు. ప్రపంచమంతా ఒక్కటేనని చాటిచెప్పేందుకు నిర్వహిస్తున్న వేదిక్ యజ్ఞకోసం డోక్లాం (్భరత్-చైనా దళాలు మోహరించిన వివాదాస్పద ప్రాంతం), పూంచ్ (నియంత్రణ రేఖ వద్ద ప్రాంతం), వాఘా సరిహద్దు, చార్ ధామ్ (నాలుగు ఆధ్యాత్మిక ప్రాంతాలు)ల నుంచి మృత్తిక, జలాలను సేకరించి యజ్ఞ నిర్మాణాలు చేపట్టనున్నారు.

రాష్ట్రీయ రక్ష మహాయజ్ఞం నిర్వహణకోసం జల్ మిట్టి యాత్రను బుధవారం ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ప్రారంభిస్తున్న హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్. ఈ కార్యక్రమానికి తరలివచ్చిన విద్యార్థులు