కృష్ణ

పన్నుల వసూళ్లలో ‘బంటుమిల్లి’ సెకండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బంటుమిల్లి, ఫిబ్రవరి 17: బందరు డివిజన్‌లో 234 పంచాయతీలలో లక్షా 40వేల 127 అసైన్‌మెంట్ల పనులను తాజా సర్వే ద్వారా 205 పంచాయతీలలో 49081 అసైన్‌మెంట్‌లను మ్యాపింగ్ చేయటం జరిగిందని బందరు డివిజన్ డీఎల్‌పీఓ జె సత్యనారాయణ అన్నారు. శనివారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ పంచాయతీల్లోని పన్ను వసూళ్ల అసైన్ మ్యాపింగ్‌ను ముమ్మరం చేయాలని ఆయన కోరారు. మండలంలోని 21 పంచాయతీలలో 11,363 ఎసైన్‌మెంట్లకు గాను 6,117 ఎసైన్‌మెంట్లు పూర్తి చేయటం జరిగిందన్నారు. మండలంలో మ్యాపింగ్ పూర్తయిన పంచాయతీలో మార్చి నెలాఖరులోపు పన్ను వసూళ్లను నూరుశాతం వసూళ్లు చేయాలన్నారు. మల్లేశ్వరం, చినతుమ్మిడి, సాతులూరు పంచాయతీలు 99శాతం పన్నుల మ్యాపింగ్ పూర్తయినట్లు తెలిపారు. బందరు డివిజన్‌లో మొవ్వ మండలం 73.71 శాతంతో ప్రధమ స్థానం, బంటుమిల్లి మండలం 54.07తో ద్వితీయ స్థానంలో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ఇఓపీఆర్‌డి ఎండి రజావుల్లా తదితరులు పాల్గొన్నారు.

రెండో రోజుకు పెద్దింటమ్మ జాతర

కైకలూరు, ఫిబ్రవరి 17: కొల్లేటి పెద్దింటమ్మ జాతర మహోత్సవాలను పురస్కరించుకుని రెండవ రోజైన శనివారం అమ్మవారిని దర్శించేందుకు జిల్లా నలుమూలల నుండి వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చి భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఆలయ ఇఓ కొండలరావు నేతృత్వంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మూడవ రోజైన ఆదివారం రెట్టింపు స్థాయిలో భక్తులు అమ్మవారిని దర్శించేందుకు తరలి రానున్న నేపథ్యంలో అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేసినట్లు ఇఓ తెలిపారు. ఇదిలా ఉండగా శనివారం కైకలూరు నియోజకవర్గ వైఎస్‌ఆర్ సీపీ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు (డీఎన్‌ఆర్), ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కోటగిరి శ్రీదర్ అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి చేస్తున్న ప్రజా సంకల్ప యాత్ర మరింత విజయవంతం కావాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈఓ ఆకుల కొండలరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శేషవస్త్రాలతో సత్కరించారు.

సరఫరాలో అవకతవకలు
పక్కదారిపడుతున్న వంటగ్యాస్

కూచిపూడి, ఫిబ్రవరి 17: మొవ్వ మండల గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు వంట గ్యాస్ డెలివరిలో అవకతవకలకు పాల్పడుతున్నారని, వంట గ్యాస్‌ను దుకాణాలలో వినియోగించటాన్ని అదుపు చేయాలని మండల ఆహార సలహా సంఘం సభ్యులు తహశీల్దార్ బి రామానాయక్‌కు సూచించారు. తహశీల్దార్ కార్యాలయంలో మండల ఆహార సలహా సంఘ సమావేశాన్ని శనివారం ఏర్పాటు చేశారు. ఎంపీపీ కిలారపు మంగమ్మ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ సమావేశంలో కూచిపూడి రైతు బజారులో నాణ్యమైన కూరగాయలు లభించటం లేదని సభ్యులు పేర్కొనగా ఇఓ బి శ్రీనివాసరావు మాట్లాడుతూ తాము ఆశించిన మేరకు కొనుగోలుదారులు రైతు బజారుకు రావటం లేదని, అందువల్ల విస్తృతంగా ప్రచారం చేపట్టాలని సభ్యులకు సూచించారు. రేషన్ దుకాణాల్లో పంచదారను కొలతతో ఇస్తున్నారని తహశీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ వి ఆనందరావు, టీడీపీ మండల అధ్యక్షుడు తాతా వీర దుర్గాప్రసాద్, వైసీపీ అధ్యక్షుడు రాజులపాటి రాఘవరావు, బీజేపీ నాయకులు లింగమనేని రాఘవేంద్రరావు, కుంపటి చింతయ్య, మురళీకృష్ణ, జిపి చలమ, ఎ శ్రీనివాసరావు, పీడీఎస్ డీటీ కె సత్య సులోచన తదితరులు పాల్గొన్నారు.