ఆంధ్రప్రదేశ్‌

నేడు గరికపాటికి లోక్‌నాయక్ పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 22: లోక్‌నాయక్ ఫౌండేషన్ 12వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం విశాఖ నగరంలో సాహిత్య, కళారంగాల్లో ఎనలేని సేవలందించిన సుప్రసిద్ధ అవధాని గరికపాటి నర్సింహరావుకు విశిష్ట సాహిత్య పురస్కారం, రైల్వేకార్మిక నేత చలసాని గాంధీకి జీవిత సాఫల్య పురస్కారం అందజేయనున్నట్టు ఫౌండేషన్ అధ్యక్షులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు. శుక్రవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పురస్కార కార్యక్రమం గురించి వివరించారు. ప్రతి ఏడాది ఇద్దరికి పురస్కారాలు అందజేస్తామని, దీనిలో భాగంగా ఈ ఏడాది సాహిత్య పురస్కారాన్ని గరికపాటి నరసింహరావుకు, జీవిత సాఫల్య పురస్కారాన్ని చలసాని గాంధీకి అందజేస్తున్నామన్నారు. ఈ నెల 23వ తేదీన జరిగే పురస్కార ప్రదాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కెవి చౌదరి హాజరవుతారన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమశే్వరర్, గీతం అధ్యక్షులు ఎంవివిఎస్ మూర్తి, కస్టమ్స్, సర్వీస్ ట్యాక్స్ ఎప్పిలేట్ ట్రిబ్యునల్ అధ్యక్షులు జస్టిస్ జి రఘురామ్, రచయిత, సినీ నటులు గొల్లపూడి మారుతీరావు, సుప్రసిద్ధ హాస్యనటులు బ్రహ్మానందం కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకులు అక్కిరాజు సుందరరామకృష్ణతో పద్యగానం నిర్వహిస్తామన్నారు.