జాతీయ వార్తలు

కొత్త హంగులతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: దేశ రాజధానిలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్‌లో నిర్మించిన బీజేపీ నూతన కార్యాలయాన్ని ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అద్వానీ, మురళీ మనోహర్ జోషి, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, సుష్మా స్వరాజ్, అనంత్ కుమార్ తదితరులు పాల్కొన్నారు. ప్రస్తుతం అశోక్ రోడ్‌లో ఉన్న కార్యాలయానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ నూతన భవనాన్ని నిర్మించారు. రెండెకరాల స్థలంలో 1.7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏడు అంతస్థుల్లో పూర్తిస్థాయి అత్యాధునిక సదుపాయాలతో కూడిన ఈ భవనంలో మొత్తం 70 రూములను ఏర్పాటు చేశారు. ముంబైకి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ భవంతిని నిర్మించింది. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా పూర్తిస్థాయిలో అత్యాధునిక సాదుపాయాలతో కార్యాలయాన్ని నిర్మించారు. 4వేల మంది కూర్చునే విధంగా ఒక విశాలమైన సమావేశ మందిరాన్ని, 200 మంది కూర్చునే విధంగా రెండు హాళ్లను ఏర్పాటు చేశారు. పార్టీ అధ్యక్షుడితోపాటుగా ప్రధాన కార్యదర్శులకు, పార్టీ కార్యవర్గ సభ్యులందరికీ వేర్వేరు గదులు ఏర్పాటు చేశారు. అలాగే నూతన కార్యాలయం నుంచి దేశంలోని అన్ని రాష్ట్రాల కార్యాలయాలకు అనుసంధానం చేస్తూ వీడియో కాన్ఫరెన్స్‌లను నిర్వహించుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. వీటితోపాటు డిజిటల్ లైబ్రరీని కూడా నిర్మించారు. 2016 ఆగస్టు 18న ఈ భవన నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయగా, అప్పటినుంచీ నిర్మాణం జరుగుతున్న సమయంలో 18సార్లు అమిత్ షా ఈ కార్యాలయాన్ని సందర్శించడం వివేశం. ఈ కార్యాలయం పూర్తిగా వైఫైతో అనుసంధానం చేశారు. కార్యకర్తలు, ఆఫీసు సందర్శనకోసం వచ్చేవారికోసం ప్రత్యేక విభాగాలను ఏర్పాటుచేయడంతోపాటుగా, 200 కార్లను పార్కింగ్ చేసుకునే విధంగా ఈ భవనం కింది భాగంలో అండర్‌గ్రౌండ్‌ను తీర్చిదిద్దారు. దేశ రాజధానిలోని లుటియేన్స్ బంగళా జోన్‌నుంచి జాతీయ పార్టీ కార్యాలయాలను వేరొకచోటుకు తరలించాలని సుప్రీం కోర్టు గతంలో ఆదేశించిన విషయం తెలిసిందే. ఇలా లుటియేన్స్ బంగాళా జోన్‌నుంచి ప్రధాన కార్యాలయాన్ని తరలించిన మొదటి జాతీయ పార్టీగా బీజేపీ నిలిచింది.

బీజేపీ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించి అందులో సమావేశమైన ప్రధాని నరేంద్ర మోదీ,
పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, సీనియర్ నేతలు, కేంద్ర మంత్రులు