జాతీయ వార్తలు

మరుగునపడుతున్న మాండలికాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: ఒకపక్క భాషలను వాటితో ముడిపడివున్న మాండలికాలను పరిరక్షించుకునే ప్రయత్నాలను ప్రభుత్వాలు చేపడుతున్న నేపథ్యంలో దేశంలో 40కి పైగా భాషలు, మాండలికాలు కరుమరుగైపోతున్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి.
అతికొద్దిమంది మాత్రమే ఈ మాండలికాలను మాట్లాడే పరిస్థితులు నేడు నెలకొన్నాయని పేర్కొన్న అధికారులు వీటిని తక్షణ ప్రాతిపదికన పరిరక్షించుకోకపోతే వాటి ఉనికే కాలగర్భంలో కలిసిపోయే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. సెన్సస్ డైరెక్టరేట్ రూపొందించిన నివేదిక ప్రకారం లక్ష, అంతకుమించి జనం మాట్లాడే భాషలు షెడ్యూల్డ్ భాషల్లో 22, నాన్ షెడ్యూల్డ్ భాషల్లో వంద ఉన్నాయని స్పష్టమవుతోంది. అలాగే పదివేల మంది కంటే తక్కువ మంది మాట్లాడే భాషలు 42కు పైగా ఉన్నాయి. ఈ భాషలు మాట్లాడేవారి సంఖ్య ఎప్పటికప్పుడు తగ్గిపోతోంది కాబట్టి ఇవి అంతరించిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నయని హోంమంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. యునెస్కో కూడా అడుగంటిపోతున్న ఈ 42 మాండలికాల గురించి తన జాబితాలో స్పష్టంగా పేర్కొందని ఈ అధికారి తెలిపారు. ఇలా అంతరించే భాషల పరిధిలోకి చేరుకున్నవాటిలో అండమాన్ నికోబార్ దీవులకు చెందిన 11 మాండలికాలు, మణిపూర్‌కు చెందిన 7 మాండలికాలు, హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన 4 మాండలికాలు ఉన్నాయని ఆయన తెలిపారు. అలాగే పర్జీ, మందా, పెంగో(ఒడిస్సా), కోరాగా, కురుబా (కర్నాటక), గదావా, నైకీ (ఆంధ్రప్రదేశ్), కోటా, తోడా (తమిళనాడు), టోటో (పశ్చిమ బెంగాల్) భాషలు కూడా వేగంగా అంతరించే దశకు చేరుకున్నాయని తెలిపారు. అడుగంటుతున్న ఈ భాషలను రక్షించేందుకు మైసూర్ కేంద్రంగా పనిచేస్తున్న భారతీయ భాషల కేంద్ర సంస్థ గట్టిగానే కృషిచేస్తోంది.
ఈ భాషలకు సంబంధించిన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని వాటికి అక్షర రూపాన్ని అందించేందుకు ప్రయత్నిస్తోంది. అలాగే పదివేల మందికంటే తక్కువ మంది మాట్లాడే అన్ని భాషలు, మాండలికాల వివరాలను సేకరిస్తోందని ఆ అధికారి తెలిపారు. 22 షెడ్యూల్డు భాషలతోబాటు భారతదేశంలో 31 భాషలున్నాయి. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు వీటికి అధికార భాష హోదాను కల్పించాయి.