జాతీయ వార్తలు

స్టార్టప్‌లకు ప్రతిభే పునాది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: కొత్త ఆలోచనలు, వినూత్న ప్రక్రియలు డబ్బు కంటే ఎంతో విలువైనవని 21వ శతాబ్దం విజ్ఞాన ఆర్థిక వ్యవస్థకు నిరుపమాన నిదర్శనమని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ ఉద్ఘాటించారు. మానవ సమాజ సుస్థిర అభివృద్ధి అన్నది భారతీయ విలువలు జోడించిన ఆధునిక శాస్త్ర సంకేతిక విజ్ఞానం ద్వారానే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ వజ్రోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన కోవింద్ ‘మానవ ప్రతిభ, విజ్ఞానం ఎలాంటి విజయాలకైనా మార్గాన్ని సుగమం చేస్తాయి. కొత్త ఆలోచనలతోనే సరికొత్త రీతిలో సౌకర్యవంతమైన సమాజాన్ని నిర్మించుకోవచ్చు. అలాగే వినూత్న ప్రక్రియల ద్వారా నాగరికతను మరింత ముందుకు తీసుకెళ్లవచ్చు. ఇవన్నీ కూడా డబ్బు కంటే ఎంతో ఉన్నతమైనవి. సమాజ ఉన్నతికి దోహదం చేసేవే’ అని అన్నారు. నేటి యువత ఇ-కామర్స్, రవాణా, టూరిజం వంటి రంగాల్లో స్టార్టప్‌లను ప్రారంభించి తమ స్వీయ ప్రతిభతో ఎంతగానో రాణిస్తోందని స్పష్టంచేసిన కోవింద్, మూలధన పెట్టుబడుల కంటే కూడా వీరి విజయానికి కొత్త ఆలోచనలు ప్రతిభే చోదక శక్తిగా మారిందని స్పష్టం చేశారు. అందుకే 21వ శతాబ్దం విజ్ఞాన ఆర్థిక వ్యవస్థకు తిరుగులేని నిదర్శనమని, ఎంతగా కొత్త ఆలోచనలు పుట్టుకొస్తే సామాజికంగా అంతగానూ ప్రయోజనం చేకూరుతుందని, ప్రతి ఒక్కరూ లబ్ధిపొందే అవకాశం ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా ఉపాధి అన్న మాటకు నేటి పరిస్థితుల్లో నిర్వచనమే మారిపోతోందని పేర్కొన్న కోవింద్, ఉపాధి అంటే కేవలం సాంప్రదాయక ఉద్యోమేమీ కాదని స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు కొత్తగా స్వయం ఉపాధి అవకాశాలను తమంతట తాముగా పెంపొందించుకోవడంతోపాటు ఇతరులకు ఈ విషయంలో అవకాశం ఇవ్వడానికి కొత్త ఆలోచనలు దోహదం చేస్తాయన్నారు. స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు యువతకు మరింత ప్రోత్సాహాన్ని అందించేందుకు ప్రభుత్వం ఎన్నో పథకాల చేపడుతోందన్నారు. ఈ అవకాశాలను ఉపయోగించుకోవాలని, తాము ఎదగడంతోపాటు ఇతరులు ఎదిగేందుకు అవకాశాలను సృజించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సామాజిక సంస్కర్త స్వామి దయానంద సరస్వతిని గుర్తుచేసుకున్న కోవింద్ ‘స్వామీజీ ప్రవచనాలను పరివ్యాప్తం చేసేందుకు ప్రముఖ విద్యావేత్త లాలా హన్స్‌రాజ్ దయానంద్ ఆంగ్లోవేదిక్ స్కూలు ఏర్పాటుకు 130 సంవత్సరాల క్రితమే లాహోర్‌లో పునాది వేశారు అని తెలిపారు. డీఏవీగా పేర్కొనే ఈ స్కూలు అనంతర కాలంలో ఎన్నో విద్యా సంస్థల ఆవిర్భావానికి కారణమైందని, ఆధునిక శాస్త్ర భావలను ప్రాతిపదికగా చేసుకుని విద్యాబోధన చేయడం ఈ సంస్థల ప్రత్యేకత అని తెలిపారు. అదేవిధంగా భారతీయ సంప్రదాయాలకు ఇది పెద్దపీట వేస్తోందని, ఆ విధంగా ఎన్నో తరాలు దేశంలో ఎదగడానికి, భిన్నరంగాల్లో పురోగతి సాధించడానికి తోడ్పడిందన్నారు. 19వ శతాబ్దం నాటి డీఏవీ సంస్థల సిద్ధాంతాలు, తాత్వికత ఈ 21వ శతాబ్దంలో కూడా ఎంతగానో రాణిస్తున్నాయన్నారు. తాను కూడా కాన్పూర్‌లోని డీఏవీ స్కూల్లోనే బీకాం ఎల్‌ఎల్‌బీ చేశానని గుర్తుచేశారు.
chitram...
ఢిల్లీ యూనివర్సిటీ వజ్రోత్సవాలకు వచ్చిన రాష్టప్రతి జ్ఞాపికను అందజేస్తున్న డీఏవీ కాలేజీ యాజమాన్యం