జాతీయ వార్తలు

మార్చి 23న రాజ్యసభ ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ఆరు స్థానాలు సహా మొత్తం 16 రాష్ట్రాల్లోని 58 రాజ్యసభ సీట్లకు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఎన్నికల షెడ్యూలు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ నుండి మూడు, తెలంగాణ నుంచి మూడు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్న విషయం తెలిసిందే. రిటైర్ అవుతున్న 58 సభ్యుల స్థానంలో కొత్త వారిని ఎన్నుకునేందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను మార్చి 5న జారీ చేస్తారు. మార్చి 12లోగా నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. మార్చి 13న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఉపసంహరణకు ఆఖరు తేదీ మార్చి 15. కొత్త సభ్యుల ఎన్నికకు సంబంధించిన పోలింగ్ మార్చి 23న జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మార్చి 23న పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు జరుగుతుంది. రాజ్యసభ ఎన్నికల్లో ఓటర్లు ఎన్నికల సంఘం సరఫరా చేసే ఇంటిగ్రేటెడ్ వాయిలెట్ రంగు పెన్నులను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. ఓటు వేసేందుకు ఇతర పెన్నులను ఉపయోగించే పక్షంలో ఆ ఓట్లు చెల్లకుండా పోతాయని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇదిలావుంటే ఆంధ్రప్రదేశ్ నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన చిరంజీవి, రేణుకాచౌదరి, తెలుగుదేశం పార్టీకి చెందిన దేవేందర్ గౌడ్ రిటైర్ అవుతున్నారు. తెలంగాణ నుండి కాంగ్రెస్‌కు చెందిన రాపోలు ఆనందభాస్కర్, తెలుగుదేశానికి చెందిన సీఎం రమేష్ రిటైర్ అవుతున్నారు. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పాల్వాయి గోవర్దన్ రెడ్డి కొంతకాలం క్రితం మరణించటం తెలిసిందే.
ఖాళీ అవుతున్న స్థానాలు:
ఆంధ్రప్రదేశ్ నుంచి 3, తెలంగాణ నుంచి 3, బీహార్ నుంచి 6, గుజరాత్ 4, చత్తీస్‌గఢ్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ నుంచి ఒక్కొక్కటి, కర్నాటక 4, మధ్యప్రదేశ్ 5, మహారాష్ట్ర 6, ఉత్తరప్రదేశ్ నుంచి 10, పశ్చిమ బెంగాల్, ఒడిశా, రాజస్తాన్ నుంచి మూడేసి చొప్పున, జార్కండ్ నుంచి రెండు స్థానాలు ఖాళీ అవుతున్నాయి.