జాతీయ వార్తలు

నేతాజీ ఫైళ్లన్నింటినీ నిర్దిష్ట వ్యవధిలోగా బయటపెట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జనవరి 23: నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించిన రహస్య ఫైళ్లన్నింటినీ బహిర్గతం చేసేందుకు నిర్దిష్ట కాలపరిమితిని ఏర్పాటు చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేసినట్లు ఆయన ముని మేనల్లుడు చంద్రబోస్ శనివారం పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు. జాతీయ భండాగారం (నేషనల్ ఆర్కైవ్స్) నుంచి నేతాజీకి సంబంధించిన 100 రహస్య ఫైళ్లను శనివారం మోదీ విడుదల చేసిన తర్వాత ఆయనకు ఈ విజ్ఞప్తి చేసినట్లు చంద్రబోస్ వెల్లడించారు. నేతాజీకి సంబంధించిన దాదాపు మరో వెయ్యి ఫైళ్లు ప్రభుత్వం వద్ద ఉన్నట్లు భావిస్తున్నామని, వీటిని కూడా నిర్ధిష్ట కాలపరిమితిలోగా బహిర్గతం చేసి సంబంధిత వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సిందిగా మోదీని కోరినట్లు ఆయన చెప్పారు.
నేతాజీ కుమార్తె పోషణకు ట్రస్టును ఏర్పాటు చేసిన కాంగ్రెస్
ఇదిలావుంటే, సుభాష్ చంద్రబోస్ కుమార్తె అనితా బోస్‌కు పోషణ నిమిత్తం ప్రతి నెలా 500 రూపాయల చొప్పున అందజేసేందుకు 1954లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) ఒక ట్రస్టును ఏర్పాటు చేసినట్లు తాజాగా వెల్లడైన నేతాజీ ఫైళ్లు స్పష్టం చేస్తున్నాయి. 1954 మే 23వ తేదీన ఏర్పాటు చేసిన ఈ ట్రస్టుకు అప్పటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి బిసి.రాయ్ ట్రస్టీలుగా వ్యవహరించినట్లు ఈ ఫైళ్లు వెల్లడిస్తున్నాయి. ‘వియెన్నాలో ఉన్న నేతాజీ కుమార్తె కోసం బిసి.రాయ్, నేను సంతకాలు చేసి ఒక ట్రస్టును ఏర్పాటు చేశాం. ఇందుకు సంబంధించిన అసలు పత్రాన్ని (ఒరిజినల్ డాక్యుమెంట్‌ను) జాగ్రత్తగా ఉంచేందుకు ఎఐసిసి కార్యాలయానికి అందజేశా’ అని 1954 మే 23వ తేదీన నెహ్రూ సంతకం చేసిన ఒక పత్రంలో ఉంది.
‘జపాన్ ప్రధానితో మోదీ మాట్లాడాలి’
అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైన నేతాజీ గురించి తెలుసుకునేందుకు ప్రధాన మంత్రి మోదీ జపాన్ ప్రధాని షింజో అబేతో మాట్లాడాల్సిన అవసరం ఉందని బోస్ బంధువు, ప్రముఖ చరిత్రకారుడు సుగతా బోస్ శనివారం స్పష్టం చేశారు. ‘నేతాజీ విషయంలో మోదీ ఏమి చేశారో నాకు తెలియదు. కానీ ఆయన బోస్ అదృశ్యం గురించి షింజో అబేతో మాట్లాడారన్న భావన కలగడం లేదు’ అని సుగతా బోస్ అన్నారు. భారత ప్రధాన మంత్రులు జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, అతల్ బిహారీ వాజ్‌పేయి గతంలో జపాన్‌కు వెళ్లినప్పుడు రెంకోజీ ఆలయాన్ని సందర్శించి సుభాష్ చంద్రబోస్‌కు నివాళులర్పించారని, అయితే ఇటీవల జపాన్‌లో పర్యటించిన మోదీ రెంకోజీ ఆలయాన్ని సందర్శించకపోవడం ఆవేదన కలిగిస్తోందని సుగతా బోస్ తెలిపారు.