Others

నమస్కారం.. ధార్మిక సంస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం నిత్యం పాటించే సంప్రదాయాల్లో ‘నమస్కారం’ ప్రధానమైంది. మనలోని వినయాన్ని చాటుకోవాలంటే ‘నమస్కారా’న్ని అవతలి వారి హృదయాన్ని తాకేలా నమ్రతతో కూడుకొని ఉండాలి. సంప్రదాయంలో ‘నమస్కారం’ అనే మాటకు యోగఫలసిద్ధికి చేసే ప్రణామమనే అర్ధం ఉంది. ప్రణామమంటే ‘నమస్కారమ్’ ప్రణిపాతం అని భగవద్గీత దీనే్న ప్రస్తావించింది. నమస్కారంలో మనిషి నిజాయితీ వ్యక్తవౌతుంది. ‘సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి’ అన్నారు. భక్తితో ఏ దేవుని మదిలో తలచుకొని నమస్కారం చేసినా అది ఆ ఆదినారాయణుడికే చెందుతుంది. అందుకు మనం చేయాల్సింది భక్తిగా నమస్కారం. తల్లిదండ్రులను, ఆచార్యునికి, గురువులకు, అతిథులకు, మిత్రులకు నమస్కరించడం మన భారతీయ సంప్రదాయమైంది. భగవంతుని ముందు తలవంచి నమస్కరించడం నవవిధ భక్తిమార్గాలలో ‘వందనం’ ఒకటి. అంటే భగవంతుని శరణాగతి పొందడం. ‘నమః మహద్భ్యో, నమో యువభ్యో, నమః శిశుభ్యో సర్వేభ్యోనమః’ అని ఋషుల వాక్కు. నమస్కార ప్రక్రియలో పలు రకాలున్నాయి.
నమస్కారంలో ఇరువురిలోనూ వినయశక్తిని పెంచే లక్షణం ఉంది. వినయం సత్త్వగుణానికి సంకేతంకాగా దాని క్రియారూపమే నమస్కరించడం. నమస్కారం చేసేటప్పుడు తలవంచుతాం అలా వంచటమే ‘నమనం’. ఇది వినయానికి చిహ్నం. మనం నమఃపూర్వకంగా సంభాషణ ప్రారంభించాలన్న సంప్రదాయం చాలా గంభీరమైన తాత్త్విక భూమికను కల్గింది.
హృదయానికి జోడించిన చేతులు తగిలేలా చేసి ‘నమః’ అని చెప్పి తల వంచడం ఇది మామూలు సాధారణ పద్ధతి. రెండు చేతులు జోడించి హృదయం దగ్గర వుంచి నమస్కరించుటను సంపుట నమస్కారమంటారు. రెండు చేతులను జోడించి శిరసును వుంచి నమస్కరించుటను ‘నమస్తిష్క’ నమస్కారమందురు. మోకాళ్ళు, చేతులు, శిరస్సు, సర్వావయములతో నమస్కరిస్తే అది సమగ్ర నమస్కారమవుతుంది. పాదాల వ్రేళ్ళు, మోకాళ్ళు, శిరస్సు నేల తగిలేటట్టు చేతులు జోడించి చేసే నమస్కారాన్ని పంచాంగ నమస్కారమంటారు.
దండంవలె దేహాన్ని నేలకానించి, చేతులు, కాళ్ళు చాచి, రెండు చేతులు మొగ్గలవలె ముకుళింపజేసి నమస్కరిస్తే దండ నమస్కారమంటారు. నొసలు, ఉదరము, రొమ్ము, మోకాళ్ళు, పాదాలు, చేతులను ముందుకు చాపి మనోబుద్ద్యభిమానాలతో నమస్కారం చేస్తే దానిని ద్వాదశాంగ నమస్కారమని, చేతులు, కాళ్ళు, రొమ్ము, నొసలు, భుజాలను నేలకానించి చేతులు మొగ్గవలె జేసి, మనోబుద్ద్యభిమానాలతో నమస్కరించుట ‘సాష్టాంగ నమస్కారం’ అంటారు. మహానుభావులకు, యోగులకు చేతులు వక్షస్థలంవద్ద జోడించి నమస్కరిస్తే, గురువుకు నమస్కారం చేసేటప్పుడు మాత్రం మన ముఖానికి నేరుగా చేతులు జోడించి నమస్కరించాలి. మనకు జన్మనిచ్చిన మాతృమూర్తికి నమస్కరించేటప్పుడు ఉదరం నేరుగా చేతులు జోడించి నమస్కరించాలి. యోగమార్గంలో ధ్యానాదులు చేస్తున్నపుడు అనుకోకుండా అప్రయత్నంగా చేతులు పైకి లేస్తాయి. అష్టాంగయోగంలో యమ-నియమ, ఆసన, ప్రాణాయాన, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు ఎనిమిది అంశలు వీటిలో ఆసనమంటే కూర్చునే విధానం, అలాగే నమస్కరించే విధానం కూడా సాష్టాంగ నమస్కార పద్దతిగా చెప్పబడింది. ధార్మిక చైతన్యాన్ని గుర్తించేలా చేసే అద్భుతమైన శక్తి నమస్కారానికి ఉంది.

- రసస్రవంతి, కావ్యసుధ