హైదరాబాద్

ఎన్‌డిఏ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్వాల్, జనవరి 24: అటల్ బిహారీ వాజ్‌పాయి ప్రధానిగా ఉన్న సమయంలోనే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందని శాసనమండలి సభ్యుడు రాంచందర్‌రావు అన్నారు. ఆదివారం అల్వాల్ వెంకటాపురం సుభాష్‌నగర్‌లో సుమారు ఐదు వందల మంది యువకులు పార్టీలో చేరిన సందర్భంగా జరిగిన బహిరంగ సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ నిజమైన అభివృద్ధి వాజ్‌పాయి ప్రధాన మంత్రిగా ఉన్నపుడే జరిగిందని అన్నారు. మెట్రో రైలు ప్రాజెక్టుతోనే నిజమైన అభివృద్ధి ప్రారంభమైందని వివరించారు. తెరాస ప్రభుత్వం.. హైదరాబాద్ నగరానికి చేసింది ఎమీ లేదని, కేవలం ప్రకటనతోనే కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ఇతర పార్టీల నాయకులను టిఆర్‌ఎస్‌లో చేర్చుకునేందుకే సమయం కేటాయిస్తున్నారని చెప్పారు.
135 డివిజన్ బిజెపి అభ్యర్థి ఎంసి జగదీశ్‌ను భారీ మెజారిటీ గెలిపించాలని కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో 135 డివిజన్ ఎన్నికల ఇన్‌చార్జి అరుల్‌రాజ్, మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ, మాజీ కౌన్సిలర్‌లు మాధవ్, నిమ్మ కృష్ణారెడ్డి, కెఆర్ శ్యామ్‌సుందర్ పాల్గొన్నారు.
సైదాబాద్‌లో..
సైదాబాద్: ఆచరణ సాధ్యం కాని హామీలతో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్.. గ్రేటర్ ప్రజలను మభ్యపెడుతున్నాడని మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. గ్రేటర్ మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకోవడం ఖాయమని చెప్పారు. సైదాబాద్ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్ధి కొత్తకాపుఅరుణ రవీందర్‌రెడ్డికి మద్దతుగా ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సైదాబాద్ ప్రధాన రహదారి నుండి శంఖేశ్వర్‌బజార్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. జయనగర్, ఎల్ సిహెచ్‌కాలనీ, చాపల మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన పార్టీ ఎన్నికల కార్యాలయాలను ప్రారంభించారు. సబితారెడ్డి మాట్లాడుతూ, సైదాబాద్‌లో కాంగ్రెస్‌కి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తల బలముందని అన్నారు. అరుణరెడ్డి భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పిసిసి కార్యధర్శి బొల్లు కిషన్, బిబ్లాక్ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, మదన్‌బాబు పాల్గొన్నారు.
ఐఎస్ సదన్‌లో..
డివిజన్ అభివృద్ధిని కాంక్షించే ఐఎస్ సదన్ వాసులు బిజెపికి ఓటు వేసి గెలిపిస్తారని డివిజన్ అభ్యర్ధి కొణతం సునితారెడ్డి అన్నారు. అదివారం ఆమె బిజెపి నాయకులు, కార్యకర్తలతో కలిసి వినయ్‌నగర్‌కాలనీ, లక్ష్మీనగర్, ఇంద్రప్రస్థకాలనీలో పాదయాత్రలో ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సునితారెడ్డి మాట్లాడుతూ, టిడిపి, బిజెపి మిత్రపక్షాలతోనే హైదరాబాద్ సమగ్రాభివృద్ది సాధ్యమవుతుందని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాలుపడుతున్న అధికార టిఆర్‌ఎస్‌కి గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఐఎస్ సదన్‌లో అవకాశమిస్తే నిత్యం ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో డివిజన్ బిజెపి అధ్యక్షుడు శివశంకర్‌గౌడ్, వీరేందర్, సామ శ్రీనివాస్‌రెడ్డి, ముద్ద ఐశ్వర్యారెడ్డి, ఎం.సులోచన, సామ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
అన్ని వర్గాల అభ్యున్నతికి పలు సంక్షేమ పథకాలు లమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వ పనితీరుతో టిఆర్‌ఎస్ అభ్యర్ధుల గెలపు ఖాయమని ఐఎస్‌సదన్ డివిజన్ టిఆర్‌ఎస్‌అభ్యర్ధి సామ స్వప్న సుందర్‌రెడ్డి అన్నారు. అదివారం ఆమె డివిజన్ పరిధిలోని మనోహర్‌నగర్‌కాలనీ, టెలికాం క్వార్టర్స్, చింతల్‌లో పాధయాత్ర ఇంటింటికి తిరుగుతూ ఐఎస్‌సదన్‌లో టిఆర్‌ఎస్‌కు పట్టం కట్టాలని కోరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఆసరా పించన్‌లు, కళ్యాణలక్ష్మీ, షాదిముబారక్, రెండు పడకల గదుల ఇళ్ళు పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందేలా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే స్వర్ణక్క, ప్రమోద, స్వాతి, బద్దం జనార్ధర్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. అభివృద్ది కాంక్షించే సైదాబాద్ వాసులు ఈ ఎన్నికల్లో అవకాశమిస్తే డివిజన్‌ను గ్రేటర్‌నే అదర్శవంతంగాతీర్చిదిద్దుతానని టిఆర్‌ఎస్ అభ్యర్ధి సింగిరెడ్డి స్వర్ణలతా శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. అదివారం డివిజన్ పరిధిలోని రెడ్డిబస్తీ, జయనగర్, ఎల్‌ఐసికాలనీ టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసిఎన్నికల ప్రచారంలో భాగంగాపాదయాత్ర ద్వారా ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్ధించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, పేదల పక్షపాతి అయిన ముఖ్యమంత్రి కెసి ఆర్ భవిష్యత్ కాలంలో గ్రేటర్ హైద్రాబాద్‌ను మురికివాడలు లేని నగరంగా తీర్చిదిద్దుతారన్నారు. సైదాబాద్‌లో టిఆర్‌ఎస్ భారీ మెజార్టీతో విజయం సాధించటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో టిఆర్‌ఎస్ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, నరేందర్‌గౌడ్ తదితరులుపాల్గొన్నారు.
పాతబస్తీలో..
చాంద్రాయణగుట్ట: చంద్రబాబునాయుడు సిఎంగా ఉన్నపుడే పాతబస్తీ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి అభివృద్ధి చేయడం జరిగిందని ఫలక్‌నూమ డివిజన్ టిడిపి అభ్యర్థి కరమ్‌తోట్ గణేష్‌రాథోడ్ అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫలక్‌నూమ డివిజన్‌లోని పలు బస్తీలలో గణేష్‌రాథోడ్ పార్టీనేతలతో కలిసి పాదయాత్ర నిర్వహించి ఇంటింటికి వెళ్లి టిడిపికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా అభ్యర్థి రాథోడ్ మాట్లాడుతూ ఫలక్‌నుమా డివిజన్‌ను అదర్శవంతమైన డివిజన్‌గా తీర్చిదిద్దుతామన్నారు. ఏ బస్తీకి వెళ్లినా స్థానికులు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని ఆరోపించారు. గత కొనే్నళ్ల నుంచి ఇక్కడ నుంచి ఎంపికవుతున్న ఎంఐఎం ప్రజా ప్రతినిధులు స్థానికులు ఎదురుకొంటున్న సమస్యల పరిష్కారం కోసం దృష్టి సారించలేక పోతున్నారని అరోపించారు.
మంచి నీటి సమస్య, డ్రైనేజీతో పాటు పారిశుద్ధ్యం వంటి అనేక సమస్యలు అనునిత్యం డివిజన్ ప్రజలను వెంటాడుతున్నాయన్నారు. ప్రజల సమస్యలు పట్టించుకోని రాజకీయ పార్టీలకు ఓటర్లు సరైన బుద్ధి చెప్పాలని రాథోడ్ కోరారు. తాను డివిజన్ కార్పొరేటర్‌గా ఎన్నికవుతే ఫలక్‌నూమ డివిజన్‌ను అదర్శవంతమైన డివిజన్‌గా తీర్చిదిద్దుతమన్నారు. ఫలక్‌నూమ డివిజన్‌లోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో టిడిపి నాయకులు అంకర్ల పాపయ్య, అబ్దుల్‌రేహమాన్, శ్యామ్‌సుందర్, రాజు, జి.మహేందర్, అంకర్ల శ్రీనివాస్, రామ్‌చందర్ తదితరులు పాల్గొన్నారు.
జంగమ్మెట్‌లో..
జిహెచ్‌ఎంసి ఎన్నికలలో భాగంగా జంగమ్మెట్ డివిజన్‌లో సిపిఐ ఆభ్యర్థి ఇటి నరసింహతో కలిసి ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌రామవత్ ఆదివారం రవీంద్రనాయక్‌నగర్, ఫలక్‌నూమ స్టేషన్‌రోడ్డు, యాదగిరి నగర్ తదితర ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఐ అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటుందని, జంగమ్మెట్‌లో సిపిఐ ఆభ్యర్థిని గెలిపించాలన్నారు. ఓటు అనే అయూదంతో పాతబస్తీలో పాతుకుపోయిన ఎంఐఎంకు తగిన బుద్ధి చేప్పలన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు చేసే ఉద్యమ పార్టీని బలపరిచి, ఎల్లపుడు పేద, బడుగు వర్గాల అభ్యున్నతి కోసం పాటు పడుతున్న పార్టీ సిపిఐ అన్నారు.
పాదయాత్రలు నిర్వహిస్తున్నపుడు అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలుపుతున్నారన్నారు. డివిజన్‌ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి ప్రజలు తనకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
మతతత్వ పార్టీలైన బిజెపి, ఎంఐఎం పాతబస్తీలో ఎదోరకమైన అలజడలను సృష్టించి పబ్బంగడుపుకున్నారు తప్పితే ఎపుడైన ప్రజల సమస్యలు పట్టించుకున్నారా అని వారు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఖలీం, మునీర్‌పటేల్, సిద్ధికి, మహ్మద్ అఫ్జల్, యాదగరి, శ్రీనివాస్, ఆరీఫ్‌ఖాన్, అనిత, హేమలత, అలివేలు తదితరులు పాల్గొన్నారు.
ఎంఐఎంను ఓడించాలి
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీని ఓడించి తగిన గుణపాఠం చేప్పాలని జంగమ్మెట్ డివిజన్ ఎంబిటి అభ్యర్థి సయ్యద్‌షాకీర్ ప్రజలను కోరారు.
ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ పాతబస్తీలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారం కోసం ఎంబిటి వ్యవస్థాపకులు స్వర్గీయ మహ్మద్ అమానుల్లాఖాన్ ఎంతో కృషి చేశారని, అప్పట్లో ప్రజల పక్షాన నిలిచి అనేక కార్యక్రమాలు చేయడంతోనే పాతబస్తీలో ఎంఐఎం పార్టీ అభివృద్ధి చెందిందన్నారు. అన్న మాటాను ఎంఐఎం పార్టీ అగ్రనాయకులు పట్టించుకోక పోవడంతోనే ఎంబిటిని స్థాపించినా అమానుల్లాఖాన్ కన్న కళలను నిజం చేయలంటే ప్రతి ఒక్కరు ఎంబిటికి ఓటు వేసి గెలిపించాలన్నారు. ప్రజా ప్రతినిధులుగా ఎన్నికవుతున్న ఎంఐఎం నాయకులు వారి స్థిర ఆస్తులను పెంచుకున్నారు తప్పితే ప్రజల బాగోగులు పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు.
జంగమ్మెట్ డివిజన్‌లోని పలు బస్తీలలో పాదయాత్ర చేసి ప్రజలను కలిసి ఎంబిటిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంబిటి నాయకులు చాంద్, యాదగిరి, నర్సింగ్, కనకరాజు, మహ్మద్ అబ్దుల్‌గఫార్, హాబీబ్‌అఖీల్‌తో పాటు మహిళ ప్రతనిధులు పాల్గొన్నారు.