Others

నాకు నచ్చిన పాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలయాన వెలసిన
సినీ హాస్య నటుడు పద్మనాభం రేఖా అండ్ మురళీ ఆర్ట్స్ పతాకంపై రూపొందించిన దేవత చిత్రంలో వచ్చే ప్రారంభ గీతం బావుంటుంది. దేవత చిత్రంలో వీటూరి వారి మనసునుంచి జాలువారి, కోదండపాణి బాణీలో ఒదిగి మధురగాయకుడు ఘంటసాల కంఠంలో నుంచి ప్రవహించి మహానటి సావిత్రి మీద బ్యాగ్రౌండ్‌లో వచ్చే సందర్భోచితమైన పాట -ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి/ ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి. పాట అద్భుతంగా ఉంటుంది.
ఈనాటి కోడళ్లు ఆ పాటని విని ఆకళింపు చేసుకుని, అత్తమామలను, భర్తను, పిల్లలను, తోటి వారిని ఎలా చూసుకోవాలో తెలుసుకోవచ్చు. అందరి మన్ననలను పొంది, పొందికగా అమరిన ఇంపైన కాపురాన్ని స్ర్తిలు ఈవిధంగా చేయాలని ఆ పాట చెబుతుంది. స్ర్తిలకోసం ప్రత్యేకంగా రాసిన ఈ పాట శాశ్వత కీర్తిని ఆర్జించింది. ఈ పాటలో ఇతర చరణాలన్నీ ఆచరణ యోగ్యమైనవే. పిల్లలను ఎలా తీర్చిదిద్దాలో, భర్తను ఎలా మురిపించాలో మరో చరణంలో చెప్పారు.
పతిదేవుని మురిపించే నవ్వుల వాన, జీవితమే పండించే పువ్వులలోన, కష్టసుఖాలలో తోడూనీడగా నిలవాలనే సందేశం ఈ పాటలో అందరికీ నచ్చుతుంది. మగువేగా మగవానికి మధురభావన అన్న భావనే అద్భుతంగా ఉంటుంది. తెలుగు సినీ అభిమానులు, సరసజ్ఞులైన ప్రేక్షకులకు ఈ పాట నచ్చదు అంటే ఎవరూ ఒప్పుకోరు. అంత గొప్పది ఈ పాట.
- ఎన్ రామలక్ష్మి, సికిందరాబాద్