Others

నాకు నచ్చిన సినిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిట్టి చెల్లెలు
అన్నా చెల్లెళ్ల అనుబంధానికి, అనురాగానికి అద్భుతమైన నిర్వచనం చెప్పిన ఎవిఎం వారు రూపొందించిన చిట్టిచెల్లెలు ఇష్టమైన చిత్రం. అన్నగా ఎన్టీఆర్, చెల్లెలుగా వాణిశ్రీ తమ పాత్రల్లో పరకాయ ప్రవేశమే చేశారు. చిన్న వయసులోనే తల్లిదండ్రులు దూరంకాగా అన్న అన్నీ తానై చెల్లెల్ని అపురూపంగా చూసుకుంటూ పెంచుతాడు. తాను కాయకష్టంచేస్తూ చెల్లెల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. ‘అందాల పసిపాప అందరికీ కనుపాప/ బజ్జోవే బజ్జాయి/ నేనున్నది నీ కొరకే/ నీ కన్నా నాకెవరే’ అనే పాట ఇప్పటికీ వింటే కళ్లవెంబడి నీళ్లొస్తాయి. అంత బాగా ఆ పాత్ర గొప్పదనాన్ని పాటలో ఇమిడ్చారు దర్శక నిర్మాతలు. చెల్లెలు పెద్దయ్యాక ఆమెకి పెళ్లిచేస్తే, దొంగల్లో కలిసిన తండ్రివల్ల అతను చనిపోతాడు. తండ్రే ఓరకంగా కూతురి బ్రతుకుని ఆ విధంగా నాశనం చేశాడు. ఈ సంగతి తెలుసుకున్న అన్న కుమిలిపోతాడు. తన చెల్లెలికి ఆమె భర్త చనిపోయాడని చెప్పలేడు. అలాగని తెచ్చి ఇవ్వనూ లేడు. వాళ్లిద్దరి మధ్య సంఘర్షణ అద్భుతమైన తాదాత్మ్యత సినిమా చూస్తున్న ప్రేక్షకులను గుండె పిండేస్తుంది. మంగళగౌరి మముగన్న తల్లి, నా మొరనే వినవమ్మా అంటూ చెల్లెలు అమ్మవారిని తన భర్తను తిరిగి పంపించమని వేడుకొనే సమయంలో నిజం తెలిసిన అన్న ఎలా ఉండగలడు. అలా ఆ సన్నివేశాల్లో ఎన్టీఆర్ నటన ఉన్నతంగా సాగుతుంది. చివరికి చెల్లెలు భర్త వియోగంతో దూరమైతే ఆ అన్న ఆవేదన ఎలా ఉంటుందో ఈ చిత్రంలో అద్భుతంగా చూపారు. రక్తసంబంధం చిత్రంలో అన్నాచెల్లెలుగా ఎన్టీఆర్, సావిత్రి ఎంత బాగా నటించారో అంతే గొప్పగా ఈ చిత్రంలో వాణిశ్రీ చెల్లెలుగా బాగా నటించారు. అన్నాచెల్లెళ్లు అంటే ఇలాగే ఉండాలి అనిపించేలా వారి నటన సాగుతుంది. అందుకే ఈ చిత్రం అంటే నాకు చాలా ఇష్టం.
-వి రాఘవరావు, చిన్నగంజాం