జాతీయ వార్తలు

ఎన్‌ఐఎ కస్టడీకి 12మంది అనుమానిత ఉగ్రవాదులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 25: ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే అభియోగాలపై దేశంలోని వివిధ ప్రాంతాల్లో అరెస్టయిన 12 మందిని ఫిబ్రవరి అయిదో తేదీ వరకు ఎన్‌ఐఎ కస్టడీకి అప్పగిస్తూ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ 12 మందిని దేశంలోని వివిధచోట్ల ఎన్‌ఐఎ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సిరియాలోని ఐఎస్‌ఐఎస్‌లో చేరడానికి యువతను సమీకరించడం, అలాంటి యువతకు ఆర్థిక సహాయం చేయడం వంటి అభియోగాలను ఎన్‌ఐఎ వీరిపై నమోదు చేసింది. సోమవారం ప్రత్యేక కోర్టులో జరిగిన రహస్య విచారణలో ప్రత్యేక ఎన్‌ఐఎ న్యాయమూర్తి అమర్‌నాథ్ ఈ 12 మందిని ఎన్‌ఐఎ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశించారు.
ఐఎస్‌ఐఎస్ భారత్‌లో విస్తరించడానికి నిందితులు పన్నిన కుట్రలను వెలికితీయాలంటే వారిని ఇంటరాగేషన్ నిమిత్తం తమ కస్టడీకి అప్పగించాలని అంతకుముందు ఎన్‌ఐఎ ప్రత్యేక న్యాయమూర్తిని అభ్యర్థించింది. గట్టి భద్రత మధ్య నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఆ సమయంలో నిందితుల ముఖాలు కనపడకుండా బట్ట కప్పారు. నిందితులను 14 రోజులపాటు తమ కస్టడీకి అప్పగించాలని జాతీయ దర్యాప్తు సంస్థ అంతకుముందు కోరింది.