క్రీడాభూమి

నేడు ఐపిఎల్ ఆటగాళ్ల వేలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఫిబ్రవరి 5: ఈ ఏడాది జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్ తొమ్మిదో ఎడిషన్‌కు సంబంధించి శనివారం బెంగళూరులో ఆటగాళ్ల వేలాన్ని నిర్వహించనున్నారు. మొత్తం 351 మంది ఆటగాళ్లను ఈ వేలంలో అమ్మకానికి పెడతారు. వీరిలో 203 మంది భారత ఆటగాళ్లు, మరో 131 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. టీమిండియా ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్, పేసర్ ఇర్ఫాన్ పఠాన్‌లతో పాటు ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా), మార్టిన్ గుప్టిల్ (న్యూజిలాండ్), కెవిన్ పీటర్సన్ (ఇంగ్లాండ్), ట్రవిస్ హెడ్ (ఆస్ట్రేలియా), డేల్ స్టెయిన్ (దక్షిణాఫ్రికా), షేన్ వాట్సన్ (ఆస్ట్రేలియా), ఉస్మాన్ ఖ్వాజా (ఆస్ట్రేలియా), జోస్ బట్లర్ (ఇంగ్లాండ్) తదితర అంతర్జాతీయ ఆటగాళ్లు ఈ వేలంలో ప్రధాన ఆకర్షణగా నిలువనున్నారు. ఐపిఎల్ నుంచి రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లను సస్పెండ్ చేయడంతో ఈసారి వాటి స్థానంలో కొత్తగా గుజరాత్ లయన్స్, రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ జట్లు బరిలోకి దిగబోతున్న విషయం తెలిసిందే. ఈ రెండు ఫ్రాంచైజీల యాజమాన్యాలు తమ జట్లను నిర్మించుకునేందుకు ఈ వేలంపై దృష్టి కేంద్రీకరించాయి.