హైదరాబాద్

నాగమణి హరికథా గానంలో ‘శివలీలలు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో కినె్నర ఆర్ట్ థియేటర్స్ నిర్వహిస్తున్న హరికథా మహోత్సవాలలో శుక్రవారం సాయంత్రం రవీంద్రభారతి ఘంటసాల ప్రాంగణంలో జగిత్యాలకు చెందిన వి.నాగమణి భాగవతారిణి ‘శివలీలలు’ను తన మధుర గానంతో రమ్యంగా తెలిపారు. డా. కె.వి.రమణాచారి 64వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటుచేసిన ఉత్సవాలలో నాగమణి ఆ కైలాసనాధుని భోళాశంకరుడిగా సార్థక నామధేయుడు ఎలా అయ్యాడో ఉదాహరణలతో గానం చేసారు. శంకరా అని పిలవగానే ‘వస్తున్నా’ అంటూ పరుగెత్తుకుంటూ వెళ్లి వరాలిస్తాడు అని చెబుతూ ‘ఓం హరా శంకరా.. వందనా దిగంబరా వందితాం పురంధర..’ అంటూ సాహిత్యానికి తగినట్లు మధ్యలో నృత్యం చేస్తూ కథాగానం చేసారు. ప్రేక్షకులను నవ్విస్తూ మధ్యలో చెప్పే పిట్ట కథలు కూడా బాగా వినోదాన్ని పండించాయి. కార్యక్రమానికి వచ్చిన అభిమానులు కె.వి.రమణాచారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సత్కరించారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి రామలింగేశ్వరరావు, డా. ఆర్.పద్మనాభరావు, పివి మనోహరరావు, ఆర్.ప్రభాకరరావు పాల్గొని నాగమణిని అభినందించారు. తొలుత కినె్నర వ్యవస్థాపకులు ఎం.రఘురామ్ స్వాగతం పలికారు.