నూతన తారల గుప్పెడంత ప్రేమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూతన తారలతో ఐవింక్ ప్రొడక్షన్స్ పతాకంపై వినోద్ లింగాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గుప్పెడంత ప్రేమ’. సాయిరోనక్, అతిథిసింగ్, ఐశ్వర్య ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, ఫస్ట్‌లుక్ హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా వినోద్ లింగాల మాట్లాడుతూ, ఫస్ట్‌లవ్ నేపథ్యంలో హృదయానికి హత్తుకునే ఫీల్‌గుడ్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, ప్రతి ఒక్కరి జీవితంలో తొలి ప్రేమ అనేది మర్చిపోలేని అనుభూతిగా మిగిలితే, అలాంటి అందమైన ప్రేమకథను గుప్పెడంత ప్రేమగా రూపొందిస్తున్నామని తెలిపారు. వినూత్న కథ, కథనం, అద్భుతమైన లొకేషన్లలో, మంచి పాటలతో ఆహ్లాదంగా సాగిపోయే యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని అన్నారు.
తమ స్వచ్ఛమైన భావాలకు యువతలోని ఆలోచనలకు అద్దంపట్టేలా ఈ చిత్రం ఉంటుందని, ఈశాన్య భారతంలోని షిల్లాంగ్, చిరపుంజి, మేఘాలయ తదితర ప్రాంతాలలో షూటింగ్ చేశామని, అలాగే తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలలోని హైదరాబాద్, గుంటూరు, వరంగల్‌లలో షూటింగ్ చేశామని ఆయన తెలిపారు. పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నామని, త్వరలో ఆడియో విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: నవనీత్ సుందర్, కెమెరా: సంజయ్ లోక్‌నాధ్, పాటలు: వనమాలి, శ్రీమణి, ఎడిటింగ్: బస్వా పైడిరెడ్డి, నిర్మాణం: ఐవింక్ ప్రొడక్షన్స్, రచన, దర్శకత్వం: వినోద్ లింగాల.