బిజినెస్

నైపుణ్యం, సామర్థ్యంతోనే విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 14: నైపుణ్యం, లక్ష్యసాధన సంకల్పం, నూతన ఆవిష్కరణల సామర్థ్యం ఉన్నప్పుడే ఏ సంస్థ అయినా విజయపథంలో దూసుకెళ్లగలదని పలువురు వాణిజ్యరంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఆదివారం ఇక్కడ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ (ఐఎంటి) హైదరాబాద్ ఆధ్వర్యంలో ‘్భరత్‌లో స్టార్టప్ సంస్థలకున్న అవకాశాలు-నిలదొక్కుకునే సమర్ధత’ అంశంపై సదస్సు జరిగింది. ఇందులో పాల్గొన్న వాణిజ్యరంగ నిపుణులు నూతన సంస్థలకు పలు సూచనలు అందించారు. సరైన వ్యాపార వాతావరణాన్ని సృష్టించుకుంటూ, ప్రభుత్వ అనుకూల విధానాలను పాటించాలని, అప్పుడే స్టార్టప్ కంపెనీలు విజయవంతమవుతాయని ఐఎమ్‌టి డైరెక్టర్ సతీష్ ఐలవాడి అన్నారు. విద్యారంగం, పరిశ్రమ వర్గాలు సమష్టిగా కృషిచేస్తేనే స్టార్టప్ కంపెనీలు ధృడంగా మారుతాయని పేర్కొన్నారు. కాగా, పారిశ్రామిక రంగంలో వస్తున్న మార్పులను గమనించగలగాలని ఆర్‌ఎ కెమ్ ఫార్మా డైరెక్టర్ శిరీష్ కుమార్ రావుల అన్నారు. డబ్బును సంపాదించాలన్న లక్ష్యంతోపాటు ఆ డబ్బుపై విలువను కలిగి ఉండాలని ఎడ్వాంటా సొల్యూషన్స్ సహ వ్యవస్థాపకులు, సిఇఒ రవి దేవులపల్లి అన్నారు. ఇక దశాబ్దాల కాలం నుంచి ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ సంస్థల్లో పెరుగుతున్న ఉపాధి అవకాశాలను, స్టార్టప్ కంపెనీలతో వస్తున్న ఉద్యోగావకాశాలను వయలెట్ స్ట్రీట్ సహ వ్యవస్థాపకులు నయన్ కుమార్ ఈ సందర్భంగా వివరించారు. ఇంక్యుబేషన్ సెంటర్ల ఏర్పాటుతో, ప్రభుత్వ సహకారంతో స్టార్టప్ కంపెనీలు అగ్రగామిగా ఎదగవచ్చని వెక్ట్రా ఫ్యామిల్టీ ఎండి మను శ్రీనివాసన్ అభిప్రాయపడ్డారు. కాగా, విద్యార్థుల్లో వ్యాపార స్థాపనకు కావాల్సిన లక్ష్యాలను నిర్దేశించుకునే శక్తిని కలిగించేలా ఓర్టస్ తరహా సదస్సులను నిర్వహిస్తున్నట్లు సతీష్ ఐలవాడి చెప్పారు.