రాష్ట్రీయం

నీటి సమస్య తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఫిబ్రవరి 15: రానున్న రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలకు నీటి సమస్య రానుందని, దాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సిఎం కె చంద్రశేఖర్‌రావు అన్నారు. ఖమ్మం పర్యటన అనంతరం సోమవారం రాత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కృష్ణా నదిపై కర్ణాటక నిర్మించిన దాదాపు 200 బ్యారేజ్‌ల వల్ల ఈ ఏడాది జూరాలకు చుక్కనీరు రాలేదన్నారు. అటు మహారాష్ట్ర గోదావరిపై నిర్మించిన బ్యారేజ్‌ల వల్ల ఎస్సారెస్పీకి చుక్కనీరు రాలేదని, దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఖమ్మం జిల్లాలో నిర్మించనున్న సీతారామ ప్రాజెక్ట్‌లాంటివి అన్నిచోట్లా చేపట్టనున్నట్టు ప్రకటించారు. పాలమూరు, కాళేశ్వరం ప్రాజెక్ట్‌ల కంటే ముందుగానే ఇది పూర్తవుతుందని స్పష్టం చేశారు. మరోవైపు ఖమ్మం జిల్లాకు అన్నం పెట్టే ప్రాజెక్ట్‌గా సీతారామ ప్రాజెక్ట్ మిగులుతుందని కెసిఆర్ అన్నారు. రాష్ట్రంలో హైదరాబాద్ వినా కార్పొరేషన్లుగా ఉన్న ఖమ్మం, కరీంనగర్, రామగుండం, నిజామాబాద్‌లకు ఏడాదికి రూ.100 కోట్ల చొప్పున అభివృద్ధి నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. వరంగల్ పెద్ద నగరం కాబట్టి ఇప్పటికే రూ.300 కోట్లు మంజూరు చేశామన్నారు. ఆయా నగరాల్లో ఉన్న డంపింగ్ యార్డులను ఉపయోగించుకొని మినీ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని కూడా ఆయన తెలిపారు. రాష్ట్ర విభజనతో ఆంధ్ర ప్రాంతంలో కలిపిన భద్రాచలం డివిజన్‌లోని నాలుగు గ్రామాలను నైసర్గిక స్వరూపం రీత్యా తెలంగాణలో కలపాలని ఆ రాష్ట్ర సిఎం చంద్రబాబుతో మాట్లాడానని, కేంద్ర ప్రభుత్వంతోనూ చర్చించామని, త్వరలోనే అవి తెలంగాణకు రానున్నాయని కెసిఆర్ వెల్లడించారు. రాష్టవ్య్రాప్తంగా అన్ని పట్టణాలు, నగరాల్లోని పేదలందరికీ ముందుగా డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మిస్తామన్నారు. దేశంలోనే అత్యధిక అర్బన్ జనాభా కలిగిన రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉందని, 42.3 శాతం పట్టణ జనాభా రాష్ట్రంలో ఉందని, వారిలో అధికులు పేదవారేనని, వారికి అండగా ప్రభుత్వం నిలుస్తుందన్నారు. నగరాలను ఆధునీకరించుకుంటే ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని స్పష్టం చేశారు. భద్రాచలం దేవస్థానం అభివృద్ధికి చిన్నజీయర్ స్వామితో కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. జిల్లాల, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఆయా జిల్లాల్లో విద్య, వైద్య సదుపాయాలు మెరుగయ్యే అవకాశం ఉందన్నారు.
అన్నిరంగాల్లోనూ తెలంగాణ రాష్ట్రాన్ని ముందంజలో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. ఖమ్మం లాంటి నగరాల్లో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మిస్తామని, తద్వారా ఖాళీ అయ్యే ప్రభుత్వ స్థలాలను నగర అవసరాల రీత్యా ఉపయోగించుకుంటామని స్పష్టం చేశారు. మరో రెండు నెలల్లో ఖమ్మం జిల్లాకు రానున్నానని, ఈలోగానే జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ ప్రారంభమవుతాయని కెసిఆర్ వివరించారు. విలేఖర్ల సమావేశంలో ఎంపి కేశవరావు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వేణుగోపాలాచారి పాల్గొన్నారు.