రాష్ట్రీయం

నేడు ఖేడ్ ఫలితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: మెదక్ జిల్లా, నారాయణ్ ఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక ఫలితం మంగళవారం వెలువడనుంది. నియోజకవర్గంలోని జూకల్ గ్రామంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లలో నిక్షిప్తంగా ఉన్న ఓటర్ల తీర్పు మధ్యాహ్ననికి వెలువడుతుంది. 14 టేబుళ్ళపై 21 రౌండ్లలో ఓట్లు లెక్కించేందుకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర చీఫ్ ఎలక్ట్రోరల్ అధికారి భన్వర్‌లాల్, జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు కొన్ని సూచనలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే పి కిష్టారెడ్డి ఆకస్మిక మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. దివంగత కిష్టారెడ్డి తనయుడు పి సంజీవ రెడ్డి పోటీ చేశారు. తెరాస అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఎం భూపాల్ రెడ్డి, తెదేపా నుంచి మాజీ ఎమ్మెల్యే ఎం విజయ్‌పాల్ రెడ్డి పోటీ చేశారు.