రంగారెడ్డి

నగరాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెపిహెచ్‌బికాలనీ, ఫిబ్రవరి 15: హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజల భాగస్వామ్యం అవసరమని, కుల, మత ప్రాంతాలకతీతంగా నగరాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని నగర మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. కెపిహెచ్‌బికాలనీలో పన్నాల హరీష్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన బాలాజీనగర్(115) డివిజన్ విజయోత్సవ సభకు నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, కూకట్‌పల్లి సర్కిల్ పరిధిలోని పలువురు కార్పొరేటర్లు హాజరయ్యారు. రామ్మోహన్ మాట్లాడుతూ గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హమీలను నెరవేర్చేందుకు ఆహర్నిశలు కృషి చేస్తామన్నారు. కూకట్‌పల్లి ప్రాంతంలో కొన్ని పార్టీలు చేసిన దుష్ప్రప్రచారాలను నమ్మకుండా టిఆర్‌ఎస్‌కు అద్భుత విజయాలు అందించారని, విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కెసిఆర్, కెటిఆర్‌లు తనపై పెట్టిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని హామీ ఇచ్చారు. నగర డిప్యూటీ మేయర్ బాబాఫసియుద్దీన్ మాట్లాడుతూ ప్రపంచంలో హైదరాబాద్ నగరాన్ని ప్రధమ వరుసలో నిలిపేందుకు ప్రజలు తమవంతు బాద్యతగా సమస్యల పరిష్కారంలో భాగస్తులు కావాలని కోరారు. ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ కూకట్‌పల్లి నియోజకవర్గంలో రూ.1850 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని చెప్పారు. సభకు అధ్యక్షత వహించిన హరీష్‌రెడ్డి బాలాజీనగర్ డివిజన్‌లో నెలకొన్న పలు సమస్యలను ప్రస్తావిస్తూ పరిష్కరించాలని మేయర్‌ను కోరారు. ఆర్‌ఎస్ బ్రదర్స్ వెనుక ఉన్న రెండున్నర ఎకరాల ఖాళీ స్థలంలో వౌలిక వసతుల ఏర్పాటు ఆ స్థలం గుండా వెళ్తున్న నాలా స్లాబ్ నిర్మాణం, రోడ్1లో స్టేడియం, దాని పక్కనే ఉన్న ఎకరం ఖాళీ స్థలం సమస్యతో పాటు చెరువుల సుందరీకరణ, సివరేజ్ ప్లాంట్ నిర్మాణం, సరైన వౌలిక వసతులు లేని ముస్కిపేట, చిత్తారమ్మ బస్తీల సమస్యలను పరిష్కరించాలని మేయర్ దృష్టికి తీసుకువెళ్లారు. కార్పొరేటర్ కావ్యారెడ్డి మాట్లాడుతూ బంగారు తెలంగాణ పునఃనిర్మాణంలో భాగస్వామ్యం అయ్యేందుకు ప్రజలు ఇచ్చిన తీర్పు స్పూర్తితో ఆదర్శవంతమైన డివిజన్‌గా బాలాజీనగర్‌ను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని అన్నారు. ముందుగా మేయర్, డిప్యూటీ మేయర్, ఎమ్మెల్యే, కార్పొరేటర్ దంపతులను వివిధ పార్టీల నేతలు, సంక్షేమ సంఘాల సభ్యులు గజమాలతో సన్మానించారు. కార్యక్రమంలో టిఆర్‌ఎస్ కార్పొరేటర్లు జూపల్లి సత్యనారాయణ, తూము శ్రావణ్, దొడ్ల వెంకటేష్‌గౌడ్, జానకి రామరాజు, ముద్దం నర్సింహ్మ యాదవ్, సబియా బేగంతో పాటు టిఆర్‌ఎస్ నాయకులు మహేందర్‌రెడ్డి, సాయినాధ్‌రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు ఏనుగు వెంకటేశ్వర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, మధు, వెంకట్‌రాంరెడ్డి, శివారెడ్డి, తులసిరెడ్డి, గణేష్, రావెల్‌షా, మణెమ్మ, తుల్జారాం, మల్లేష్ యాదవ్ పాల్గొన్నారు.