బిజినెస్

నాణ్యమైన బొగ్గు సరఫరాకు మరిన్ని కోల్ వాషరీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 19: ప్రస్తుతం ఉన్న మూడు కోల్ వాషరీలకు అదనంగా రానున్న రోజుల్లో మరో మూడు వాషరీలను నెలకొల్పనున్నట్లు సింగరేణి సంస్థ చైర్మన్, ఎండి ఎన్.శ్రీధర్ తెలిపారు. పర్యావరణ శాఖ నిబందనలకు లోబడి ఇప్పటికే నాణ్యమైన బొగ్గు వివిధ పరిశ్రమలకు సరఫరా చేస్తున్నామని ఆయన వివరించారు. శుక్రవారం తిరుపతిలో జరిగిన పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీకి సింగరేణి సంస్థ తరఫున శ్రీధర్ హాజరై నివేదికను సమర్పించారు. 34 శాతం కన్నా ఎక్కువ శాతం బూడిద పరిమాణం ఉన్న బొగ్గును 500 కిలోమీటర్ల పరిధి దాటి రవాణా చేయరాదన్న నియమం ఉందని, అయితే సింగరేణి గనుల్లో ఉత్పత్తి అయ్యే బొగ్గు 34 శాతం కన్నా తక్కువగా ఉండడం వల్ల 500 కిలోమీటర్లకు పైబడి దూరంలో ఉన్న విద్యుత్ సంస్థలకు బొగ్గు రవాణా చేస్తున్నట్లు ఆ నివేదికలో తెలిపారు. రానున్న రోజుల్లో సత్తుపల్లి, రామగుండం, బెల్లంపల్లి ప్రాంతాల్లో 12 మిలియన్ టన్నుల బొగ్గును శుద్ధి చేసే సామర్ధ్యం ఉన్న వాషరీలను నెలకొల్పనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సమావేశానికి కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ, పర్యావరణ శాఖల సహాయ మంత్రి పీయూష్ గోయల్ అధ్యక్షత వహించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 14 మంది పార్లమెంటు సభ్యులు, కోలిండియా చైర్మన్ సుతీర్థ భట్టాచార్య, నైవేలీ లిగ్నైట్ చైర్మన్ ఆచార్య, అదనపు కార్యదర్శి దూబే, బొగ్గు శాఖ సలహాదారు డి.ఎన్.ప్రసాద్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.