క్రీడాభూమి

నెట్ ప్రాక్టీస్‌కు ధోనీ, నెహ్రా దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫతుల్లా, ఫిబ్రవరి 26: ఆసియా కప్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో శనివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో హై-ఓల్టేజ్ మ్యాచ్‌కు సిద్ధమవుతున్న భారత జట్టు శుక్రవారం ముమ్మరంగా నెట్ ప్రాక్టీస్ చేసింది. అయితే టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో పాటు సీనియర్ పేసర్ ఆశిష్ నెహ్రా ఈ సాధనకు హాజరు కాలేదు. వెన్ను నొప్పితో ఇబ్బంది పడుతున్నప్పటికీ ధోనీ ఈ టోర్నీ ఆరంభంలో ఆతిథ్య బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ నొప్పి నుంచి కోలుకునేందుకు వీలుగా పాకిస్తాన్‌తో పోరుకు ముందు తగిన విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడంతో శుక్రవారం ధోనీ నెట్‌ప్రాక్టీస్‌కు హాజరు కాలేదు. కాగా, గాయాల నుంచి ఇటీవలే కోలుకున్న ఆశిష్ నెహ్రాకు ప్రస్తుతం ఎటువంటి ఇబ్బందులు లేకపోయినప్పటికీ ప్రత్యేక శిక్షణా కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉండటంతో అతను కూడా శుక్రవారం నెట్ ప్రాక్టీస్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది.