జాతీయ వార్తలు

అఖిలేశ్‌కోసం తప్పుకుంటా?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 4: ఓ పక్క యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ అధినాయకత్వం అన్ని రకాల వ్యూహాలతో ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఈ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి షీలా దీక్షిత్ బుధవారం సంచలన ప్రకటన చేశారు. తనకంటే కూడా ముఖ్యమంత్రిగా అఖిలేశ్ సమర్థుడైన అభ్యర్థి అని, అతనికోసం పోటీనుంచి తప్పుకోడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఓ జాతీయ చానల్‌కు ఇచ్చిన ఇంటర్‌వ్యూలో స్పష్టం చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార సమాజ్‌వాదీ పార్టీతో కలిసి పోటీ చేయడానికి కాంగ్రెస్ పావులు కదుపుతున్న నేపథ్యంలో షీలా దీక్షిత్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంటుందా లేదా అన్నది తనకు స్పష్టంగా తెలియదని ఆమె వివరణ ఇచ్చారు.