Others

భక్త తుకారాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహారాష్టల్రో పాండురంగ విఠలుడికి పదిహేడవ శతాబ్దంలో జన్మించిన మహా భక్తుడు తుకారాం జీవిత చరిత్రను కడురమ్యంగా, జనరంజకంగా తెరకెక్కించిన చిత్రం -్భక్తతుకారాం. 1973లో విడుదలైన చిత్రాన్ని అంజలీ పిక్చర్స్ బ్యానర్‌పై ఆదినారాయణరావు, అంజలీ దంపతులు నిర్మించారు. వామపక్ష భావాలు కలిగిన దర్శకుడు వి మధుసూదనరావు ఆస్తికవాదులు సైతం భక్తిపారవశ్యంలో మునిగిపోయేలా చిత్రాన్ని రూపొందించారు. తుకారాం పాత్రలో అక్కినేని విలక్షణ రీతిలో నటించగా, ఆయన భార్యగా అంజలి, శివాజీగా శివాజీగణేశన్, పీఠాధిపతి కుంభాజీగా నాగభూషణం తమదైన శైలితో మెప్పించారు. ఆదినారాయణరావు స్వరకల్పన చేసిన ప్రతీ పాట ఒక ఆణిముత్యంగా నిలిచింది. సంసారంలో ఉంటూనే నిరంతరం పాండురంగడి ఆరాధనలో మునిగి తేలే తుకారాం ప్రాభవం రోజురోజుకూ పెరుగుతుండటంతో అతనిపై కుంభాజి అనేక కుట్రలు చేస్తుంటాడు. ఆఖరికి అహర్నిశలు శ్రమించి రూపొందించిన అభంగాలను సైతం నీటిపాలు చేస్తాడు. కాని విఠులని కృపతో ఆ అభంగాలు తిరిగి తుకారామ్‌కు లభ్యవౌతాయి. చివరకు ఛత్రపతి శివాజీకి సైతం తుకారాంపై లేనిపోని అపవాదులు కల్పించగా, శివాజీ పరీక్షలో తుకారాం పరిశుద్ధుడని రుజువవుతుంది. తుకారాం కన్నీటి ప్రార్థనకు కరిగిపోయిన పాండురంగడు అనేక శివాజీలుగా వచ్చి శత్రువులకు చిక్కిన శివాజీని రక్షిస్తాడు.
శూద్రుల కులంలో పుట్టినా, సంసారిగావుంటూ తన బాధ్యతలను నెరవేరుస్తునే మరొకపక్క అచెంచల విశ్వాసం, భక్తిప్రేమలతో పాండురంగడిని కొలుస్తూ ఇంకొకపక్క ఇతరుల కోసం సర్వం త్యాగంచేసే మహనీయుడని తుకారాం వైభవాన్ని తెలియపర్చేందుకు అతడిని సశరీరుడిగా వైకుంఠానికి రప్పించుకునేందుకు శ్రీమహావిష్ణువు గరుడ వాహనాన్ని పంపిస్తాడు. పరిశుద్ధులైన భక్తులకు మోక్షం కల్పించడమే తన కర్తవ్యమన్న సందేశాన్ని యావత్ ఆస్తిక సమాజానికి అద్భుతంగా భగవంతుడు అందించాడు. వి రామకృష్ణ పాడిన పాండురంగనామం పాట ఇప్పటికీ హృదయాంతరాళాలలో ఆధ్యాత్మిక భక్తి పారవశ్యం కలిగిస్తుంది. అక్కినేని స్వతహాగా నాస్తికుడంటారు. కానీ భగవంతుని ప్రేమ, కరుణాకటాక్షాలను చూరగొన్న భక్తునిగా ఆయన నటన అపూర్వం, అద్వితీయం, అసామాన్యం.

-సి ప్రతాప్, శ్రీకాకుళం