Others

కలువకు చంద్రుడు ఎంతో దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ నిజాం పరిపాలనలో భూస్వాములకు వ్యతిరేకంగా దాశరథి రంగాచార్య రచించిన నవల ‘చిల్లరదేవుళ్లు’ ఆధారంగా అదే పేరుతో 1977లో రూపొందించిన చిత్రంలోనిదీ పాట. రచన ఆచార్య ఆత్రేయ. ‘దూరమైనకొలదీ పెరుగును అనురాగం/ విరహంలోనే ఉంది అనుబంధం’ అంటారు పాటలో ఆత్రేయ. ఇద్దరి మిత్రుల కలహాలు ఎన్నో రోజులు ఉండవని, వారిదూరం ఏదో సందర్భంలో కలుసుకొని, తమ విరహాన్ని ఆలింగనంతో, ఆప్యాయతతో, కరస్పర్శలతో కలుపుకోవటంలో చూపిస్తారన్నది రచయిత చక్కగా వివరించారు.
‘నవ్వునవ్వుకు తేడా ఉంటుంది/ నవ్వే అదృష్టం ఎందరికుంటుంది/ అది కలిమి లేములను మరిపిస్తుంది’ అంటారు తరువాత. వారి ఆలింగనంలో, ఆప్యాయతలో, నవ్వులుంటాయని, వాటిలో తేడా ఉంటాయని, వారి మనసులు తెలుసుకొని చక్కగా వివరణ ఇచ్చాడు ఆచార్య ఆత్రేయ.
‘వలపుకన్నా తలపే తియ్యన/నేటికన్నా రేపే తియ్యన’. ఈ అనురాగ బంధాలు రేపటిరోజు ఎలా మారుతాయోనన్న అంశాన్ని వడపోసి రుచి చూసినట్టుగా స్నేహబంధాన్ని కవి చాతుర్యంతో చెప్పాడు.
‘మనసు మనిషిని మనిషిగ చేస్తుందీ/ ఆ దేవుడికీ మనిషికి తేడా ఏముంటుంది’. ఈ అనురాగ ఆప్యాయత స్నేహబంధాలు చిరకాలం ఉంటే మనిషికి దేవుడికి తేడా ఏముంటుందన్న సత్యాన్ని ఆచార్య ఆత్రేయ చిత్రానికి అద్దం పట్టినట్టుంది. గానం బాలు అద్భుతంగా పాడి వినిపించారు. సంగీతం కెవి మహాదేవన్ వీనుల విందుగా స్నేహం తియ్యదనాన్ని సంగీతంలో వినిపించారు.
-జమలాపురం ప్రసాదరావు, ఖమ్మం