జాతీయ వార్తలు

మహా సంక్షోభం ముగిసినట్లేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: మహారాష్టల్రో నెలకొన్న రాజకీయ సంక్షోభం ఇక ముగిసినట్లే అనిపిస్తోంది. శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ (ఎన్సీపీ), కాంగ్రెస్ మధ్య కుదిరినట్లు సంకేతాలు వెలువడ్డాయి. ఈ మేరకు మూడు పార్టీల మధ్య అధికార పంపకాలు దిగ్విజయంగా పూర్తయినట్లు వెల్లడైంది. ఐదేళ్లపాటు శివసేన సైనికుడే సీఎం పదవిలో ఉండేటట్లు, ఎన్సీపీ, కాంగ్రెస్‌లకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చేటట్లు ఒప్పందం కుదిరింది. స్పీకర్ పదవిని కాంగ్రెస్‌కు, కౌన్సిల్ చైర్మన్ పదవి ఎన్సీపీకి ఇవ్వనున్నారు. అలాగే మంత్రివర్గంలో శివసేనకు 14, ఎన్సీపీకి 14, కాంగ్రెస్‌కు 12 మంత్రి పదవులు దక్కనున్నాయి. ఈ మేరకు అధికార పంపకాలు పూర్తిచేసుకుని అధికారాన్ని చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయి.