రాము పాత్రలో ఎంజాయ్ చేశా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* నాగార్జున

అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రం సోగ్గాడే చిన్నినాయన. కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన వీడియోను ఇటీవలే విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, ఈ సినిమాలో రాము అనే డాక్టర్ పాత్రలో కనిపిస్తాను. తను మంచి తెలివైనవాడే కానీ అతనికి వేష భాషల గురించి తెలియదు. జుట్టు దువ్వుకోవడం, చొక్కా సరిగ్గా వేసుకోవడం లాంటివికూడా సరిగ్గా తెలీదు. అంతేకాదు, చిన్న చిన్న వాడుక పదాలకి కూడా గూగుల్‌లో అర్థాలు వెతుకుతుంటాడు. నిజంగా ఈ పాత్ర చేసేటపుడు చాలా ఎంజాయ్ చేశా. ప్రేక్షకులకు కూడా బాగా నచ్చుతుంది అన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రంలోని పాటలు త్వరలో విడుదల కానున్నాయి. చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో రెండు పాత్రల్లో నాగార్జున నటిస్తున్నాడు.