రాష్ట్రీయం

ఆంధ్ర-చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఎదురుకాల్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శబరి ఏరియా మావోయిస్టు కార్యదర్శి నగేష్ మృతి
చింతూరు, డిసెంబర్ 28: ఆంధ్రా-్ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని మల్లంపేట-మైతా అటవీప్రాంతంలో సోమవారం జరిగిన ఎదురుకాల్పుల్లో శబరి ఏరియా మావోయిస్టు కార్యదర్శి కల్మా చుక్కా అలియాస్ నగేష్ మృతిచెందాడు. మల్లంపేట - మైతా అటవీ ప్రాంతంలో నగేష్ సంచరిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీనితో ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్ పోలీసులు, స్పెషల్ టాస్క్ఫోర్సు బలగాలు ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఈ సమయంలో మావోయిస్టులు తారసపడడంతో ఇరువర్గాల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పులలో నగేష్ మృతిచెందాడు. మరో మావోయిస్టును పోలీసులు అదుపులోనికి తీసుకున్నట్లు సమాచారం. నగేష్ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా కృష్టారం పోలీసు స్టేషన్ పరిధిలోని డోకుపాడు గ్రామానికి చెందినవాడు. 2008లో మావోయిస్టు దళంలో చేరిన నగేష్ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనేవాడు. ఛత్తీస్‌గఢ్, ఆంధ్రా దండకారణ్యంలో పలు విధ్వంసకర చర్యలు, హత్యల్లో కీలకపాత్ర పోషించాడు. 2013, నవంబర్‌లో శబరి ఏరియా కార్యదర్శి నరేష్ ఎదురుకాల్పుల్లో మృతిచెందాడు. అనంతరం శబరి ఏరియా కార్యదర్శిగా నగేష్ బాధ్యతలు చేపట్టాడు. నగేష్‌పై 30 హత్య కేసులు ఉన్నట్లు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాష్ తెలిపారు. ఈ ఏడాదే అయిదు హత్య కేసులు నమోదయ్యాయి. ** నగేష్ (ఫైల్ ఫొటో) **