రాష్ట్రీయం

అందుకోండి.. నజరానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిరుద్యోగులకు సిఎం కెసిఆర్ నూతన సంవత్సర వరాలు
కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణ
20 వేల మంది ఉపాధ్యాయుల నియామకానికి డిఎస్సీ
9 వేల మంది కానిస్టేబుల్ పోస్టుల భర్తీ
ఔట్ సోర్సింగ్, హ్యాండ్ హోల్డింగ్ సిబ్బందికి వేతనాల పెంపు
50 వేల మంది సిబ్బందికి లబ్ధి
భవిష్యత్‌లో కాంట్రాక్టు వ్యవస్థకు స్వస్తి
సమీక్ష సమావేశంలో సిఎం కెసిఆర్ నిర్ణయాలు

హైదరాబాద్, డిసెంబర్ 31: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి తమ సర్వీసుల క్రమబద్ధీకరణ కోసం ఎదురు చూస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు, డిఎస్సీ కోసం ఎదురు చూస్తున్న ఉపాధ్యాయ అభ్యర్థులకు, వేతనాల పెంపుకోసం వేచి చూస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందికి, ఉద్యోగాల కోసం ఎదురు చేస్తున్న నిరుద్యోగులకు నూతన సంవత్సర కానుకగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు తీపి కబురు అందించారు. రాష్ట్రంలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించడంతో పాటు నిరుద్యోగ యువకులు ఎదురు ఉపాధ్యాయుల నియామకానికి డిఎస్సీకి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఔట్ సోర్సింగ్ సిబ్బందికి సర్వీసుల క్రమబద్ధీకరించడం సాధ్యం కాకపోవడంతో వారికి వేతనాలు ప్రకటించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. కాంట్రాక్టు ఉద్యోగులు, నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది తదితర అంశాలపై సచివాలయంలో గురువారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ప్రదీప్ చంద్ర, డిజిపి అనురాగ శర్మ తదితరులతో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇందులో పలు కీలక నిర్ణయాలను ముఖ్యమంత్రి తీసుకున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసుల క్రమబద్దీకరణ, డిఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల నియామకాల వల్ల సుమారు 50 వేల మందికి లబ్ధి చేకూరనుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ నిర్ణయాలపై శనివారం జరుగబోయే మంత్రివర్గ సమావేశంలో ఆమోదించనున్నట్టు కూడా ముఖ్యమంత్రి వెల్లడించారు. మంత్రి వర్గ సమావేశం లోపు వివిధ శాఖల వారీగా కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలను అందజేయాల్సిందిగా ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు అందరి సర్వీసులను క్రమబద్ధీకరించిన తర్వాత భవిష్యత్‌లో ఇక కాంట్రాక్టు ఉద్యోగుల వ్యవస్థ రాష్ట్రంలో ఉండదని కెసిఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో వివిధ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ కోసం వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని స్పష్టం చేశారు. రాష్టవ్య్రాప్తంగా 15 నుంచి 20 వేల వరకు ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ కోసం డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలన్నారు. ఔట్ సోర్సింగ్ సిబ్బందితో పాటు హ్యాండ్ హోల్డింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. వేతనాలు పెంచడంపై ప్రతిపాదనలు తయారు చేయాలని ఆర్థికశాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. పోలీసుశాఖలో తొమ్మిది వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం కూడా నోటిఫికేషన్ జారీ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వివిధ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు, అలాగే పలు సమావేశాలు, సభలకు వెళ్లినప్పుడు తనకు అందజేసిన వినతి పత్రాలను శాఖల వారీగా విభజించి అధికారులకు ముఖ్యమంత్రి అందజేశారు. వినతి పత్రాలను అధ్యయనం చేసి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. (చిత్రం) గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులతో ముఖ్యమంత్రి కెసిఆర్