నల్గొండ

వర్గీకరణ చట్టబద్ధత సాధనకై మరో ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోత్కూరు, నవంబర్ 21: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు పార్లమెంట్ ద్వారా చట్టబద్ధత సాధనకై ఈనెల 25న నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో జరిగే బహరంగ సభకు మాదిగలను మరోఉద్యమనికి సన్నద్ధం చేయడానికి తుంగతుర్తి నియోజకర్గస్థాయి బహిరంగ సభను మోత్కూరులో నిర్వహించడం జరిగిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద క్రిష్ణ మాదిగ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని బాబూ జగ్జీవన్‌రామ్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈనెల 25న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రిజర్వేషన్ల అమలు కోసం అసెంబ్లీలో ఏకాభిప్రాయ తీర్మానం చేయించడం అందుకు తగినట్లుగా కేంద్రప్రభుత్వం వేసిన ఉషమోహ్రా కమిషన్ కమిషన్ రాష్ట్రంలో సర్వేచేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం, అన్ని రాజకీయ పార్టీల అంగీకార లేఖలను కేంద్ర ప్రభుత్వానికి అందించప్పటికీ వర్గీకరణ ప్రకటన తప్ప జరగాల్సిన ప్రక్రియలు జరగలేదన్నారు. ఎబిసిడి వర్గీకరణ సమస్యను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వర్గీరణపై చేసిన ఏకగ్రీవ తీర్మానంతో అఖిలపక్షాన్ని డిల్లీకి తీసుకెళ్లి పార్లమెంట్‌లో చట్టబద్ధత కల్పించాలని డిమాం డ్ చేశారు. తాను 2001లోనే ఈతల్లి తెలంగాణ పుస్తకంలో వెలుమల, కమ్మల ఆధిపత్యం ఉండకూడదని రాశానని గుర్తు చేశారు. తొలుత అంబేద్కర్, బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహాలకు పూలమాలువేసి నివాళలర్పించారు. కార్యక్రమంలోచెడిపెల్లియాదగిరి, బోడ యాదగిరి, సురేష్, సూరా రం యాదగిరి, బిక్షం పాల్గొన్నారు.
క్రీడలను ప్రారంభించిన ఎజెసి
తిప్పర్తి, నవంబర్ 21 : జిల్లా స్థాయి రాజీవ్‌గాంధీ ఖేల్ అభియాన్ మహిళల 2015-16 కబడ్డీ, వాలీబాల్ జిల్లా స్ధాయి పోటీలను నల్లగొండలోని మేకల అభినవ్ స్టేడియంలో ఎజెసి వెంకట్‌రావు జడ్పీ సిఈవో మహేందర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. శనివారం జిల్లా నలుమూలల నుండి వివిధ మండలాల జట్లకు సంబంధించిన జిల్లా స్థాయి పోటీలను డిఎస్‌డివో మక్బూల్ అహ్మద్ ఆధ్వర్యంలో స్కూల్ గేమ్స్ సెక్రటరీ జె.పుల్లయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు క్రీడాకారులను పరిచయం చేసుకొని వారిలో క్రీడా స్పూర్తిని, ఉత్సాహాన్ని అందించారు. జిల్లాను ప్రథమ స్ధాయిలో నిలిపే లక్ష్యంగా కృషి చేయాలని వారికి ఉద్బోదించారు. పోటీలలో ప్రతిభ చూపిన విద్యార్ధులను నల్లగొండ జిల్లా జట్టుగా ఎంపిక చేపడుతుందన్నారు. పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు, మెమెంటోలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల వ్యాయామ అసోసియేషన్ తెలంగాణ జిల్లా అధ్యక్షులు పి.కృష్ణమూర్తిగౌడ్, తెలంగాణ తెలంగాణ పి ఈటి అసోసియేషన్ నర్సిరెడ్డి, హన్మంతరావు, విజయ్‌కుమార్, శంబులింగం, రవీందర్, గిరిబాబు, మల్లేష్, వెంకటేశ్వర్లు, డోమినిక్ ఇద్దయ్య, రఘువీర్‌సింగ్, మోహన్, నజీర్ పాల్గొన్నారు.
మహిళల భద్రతకు షీటీం విస్తృత సేవలు
తిప్పర్తి, నవంబర్ 21: మహిళల భద్రతకు షీ టీం ద్వారా సేవలను మరింత విస్తృత పరుస్తునామని, షీ టీంపై ప్రతి ఒక్కరు అవగాహన కల్గి ఉండి, వినియోగించుకోవాలని షీ టీం జిల్లా అధికారి, సిసిఎస్ డిఎస్పీ సునీతాచంద్రమోహన్ అన్నారు. శనివారం నల్లగొండ పట్టణంలోని ఎంవిఎన్ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఉచితంగా గ్రూప్ శిక్షణ పొందే 700మంది విద్యార్థులకు మహిళలపై జరిగే అవాంచనీయ సంఘటనల పట్ల, స్ర్తిలపై జరిగే దాడులు, సారా, మద్య నిషేదంపై విద్యార్థులకు షీ టీంల ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డిఎస్పీ సునీత మాట్లాడుతూ ఆధునిక యుగంలో విద్యార్థులు, మహిళలు అప్రమత్తంగా ఉండి, దాడులను ఎదుర్కోవాలన్నారు. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి ఆర్ధికంగా ఎదగాలన్నారు. ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్‌ను విద్యార్థులు రూపుమాపాలని, విషసంస్కృతి ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎక్సైజ్ డిఎస్పీ గాయత్రి మాట్లాడుతూ సారా నిషేధంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కన్వీనర్ అక్కెనపల్లి మీనయ్య, నరేష్, ఏడుకొండలు, పాల్వాయి రవి, షీటీం సభ్యులు రమేష్, రేవతి పాల్గొన్నారు.