నల్గొండ

అక్రమాల పూడికలో మిషన్ కాకతీయ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఏప్రిల్ 3: జిల్లాలో మిషన్ కాకతీయ పనుల్లో అక్రమాల పూడికలు క్రమంగా వెలుగుచూస్తున్నాయి. ప్రతిపక్షాలకు తోడు అధికార పక్షం ఎమ్మెల్యేలు సైతం మిషన్ కాకతీయ పనుల్లో అక్రమాలను బయటపెడుతు ఇరిగేషన్ అధికారుల తీరును ఎండగడుతుండటం జిల్లాలో చెరువుల పునరుద్ధరణ పనుల నాణ్యతను ప్రశ్నార్ధకం చేస్తుంది. లెస్ టెండర్లతో వందల కోట్లు ఆదా అయ్యాయంటు ప్రభుత్వం గొప్పలు పోతుండగా క్షేత్ర స్థాయిలో అసలు మిషన్ కాకతీయ పనుల్లో అక్రమాలకు లెస్ టెండర్లే కారణమన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. సాక్షాత్ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రారంభించిన నకిరేకల్ నియోజకవర్గంలోని చందుపట్ల చెరువు పునరుద్ధరణ పనుల్లో అక్రమాలు జరిగినట్లుగా స్థానిక టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే వేముల వీరేశం జడ్పీ సమావేశంలో ఆరోపించడంతో మిషన్ కాకతీయ అక్రమాల పర్వం రచ్చకెక్కింది. లెస్ టెండర్లతో చెరువుల పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు తొలి దశల 817చెరువులకు కేవలం 389చెరువుల పనులు పూర్తి చేశారు. మరో 428చెరువులను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు ఆదేశాలిచ్చారు. దీంతో హడావుడిగా కాంట్రాక్టర్లు మరింత నాసిరకంగా పనులు చేసే పరిస్థితి చెరువుల పునరుద్ధరణ పనుల నాణ్యతకు సవాల్‌గా మారింది.
ప్రభుత్వానికి మిగులు..పనులకు తెగులు..
చెరువుకు దిగులు!
జిల్లాలో మిషన్ కాకతీయ తొలి విడత కింద 843చెరువులకు 334కోట్లకు ప్రభుత్వం పరిపాలన ఆమోదమిచ్చింది. కాంట్రాక్టర్లు పనులు దక్కించుకునే ప్రయత్నంలో పోటీ పడి లెస్ టెండర్లతో 161కోట్లకే టెండర్లు వేశారు. పనులు చేపట్టిన 817చెరువులకు 131.83లక్షలకు అగ్రిమెంట్ చేసుకున్నారు. దీంతో ప్రభుత్వం కేటాయించిన దానికంటే 20శాతం తక్కువగా లెస్ టెండర్లు వేయడంతో ప్రభుత్వానికి 60కోట్లు మిగిలాయి. కొంత మంది కాంట్రాక్టర్లయితే ఏకంగా 30శాతం లెస్‌కు టెండర్లు వేశారు. దీంతో లెస్‌లతో టెండర్లు వేసిన కాంట్రాక్టర్లు సహజంగానే లాభాల కోసం చెరువుల మరమ్మతుల పనుల్లో అక్రమాలకు తెరలేపినట్లయింది. దీనికి తోడు వ్యాట్, సెస్ వంటి చార్జిలు 117కోట్ల మేరకు కాంట్రాక్టర్లకు చెల్లించిన డబ్బుల నుండి కోత పెట్టుకోవడంతో కాంట్రాక్టర్లు 157కోట్లలో పనులు చేయాల్సివచ్చింది. అంటే మొత్తంగా ప్రభుత్వం కేటాయించిన 334కోట్లలో జిల్లా నుండి మొదటి విడత మిషన్ కాకతీయ కింద 177కోట్ల ఆదా జరిగినట్లుగా తేలుతుంది. ఇక లెస్ టెండర్ల వ్యవహారంతో నష్టపోయిన కాంట్రాక్టర్లు చివరకు చెరువుల పనురుద్ధరణ పనుల్లో తమ నష్టాలను పూడ్చుకునేందుకు ప్రయత్నిస్తుండటంతో మిషన్ కాకతీయ అక్రమాల బాట పట్టినట్లయింది.
ఇది ఇలా ఉండగా రెండో దశలో జిల్లాలో 1088చెరువుల పునరుద్ధరణకు ప్రతిపాదనలు పంపగా 1059చెరువులకు ప్రభుత్వ అనుమతి లభించగా 947చెరువులకు టెండర్లు పిలువగా 516చెరువులకు అగ్రిమెంట్ పూర్తవ్వగా 179చెరువుల్లో పనులు ప్రారంభమయ్యాయి. రెండో దశలో కాంట్రాక్టర్లు ఎంత లెస్ వేశారన్నదానిపై లెక్కలు వెల్లడికావాల్సివుంది.