నల్గొండ

బలహీన వర్గాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుర్కపల్లి, అక్టోబర్ 18: బడుగు, బలహీనవర్గాల వారి అభివృద్ది కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునితామహేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం వందశాతం సబ్సీడీపై ఇస్తున్న చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నియోజకవర్గంలోని అతిపెద్ద చెరువు అయిన గంధమల్ల చెరువులో 46వేల చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బలహీనవర్గాల ప్రజల ఆనందమే ముఖ్యమంత్రి లక్ష్యమన్నారు. రాష్ట్రంలో కులవృత్తులు అంతరించిపోకుండా ఉండటం కోసమే మత్స్య, గొర్ల, కురుమ, గౌడ వంటి తదితర కులాల సంఘాలను బలోపేతం చేస్తున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గంగపుత్రులకు, మత్స్యపరిశ్రమలకు ఏడాదికి 1కోటి కేటాయిస్తే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 50 కోట్లు రాష్ట్ర బడ్జెట్‌లో భాగంగా జిల్లాలో 4వేల 553 చేరువుల్లో 100శాతం సబ్సీడీతో 45 లక్షల చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు. 60 సంవత్సరాల ఉమ్మడి రాష్ట్రంలోని సాధించలేని విద్యుత్‌ను రైతులకు 9 గంటల విద్యుత్, వెయ్యి రూపాయల ఫించన్, వికలాంగులకు 1500, ఇంటింటికి తాగునీరు, చెరువులో పూడిక తీత వంటి పనులను సాధించి తెలంగాణ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని నిరూపించుకుందన్నారు. జిల్లాలో అన్ని చెరువులు, కుంటలు నిండాయని, దీనికి కేసి ఆర్ చేసిన ఛండియాగమే ఫలితమన్నారు. గంధమల్ల చెరువును రిజర్వాయర్‌గా మార్చి ప్రాంతాన్ని సస్యశ్యామలంగా చేయడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఉమారాణి, ఎంపిడి ఒ జలేందర్‌రెడ్డి, నాగలక్ష్మీ, పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్, ఎంపిటిసిలు శ్రీను, అరుణ, లక్ష్మీ, భాగ్యమ్మ, నాయకులు నర్సింహులు, నరేందర్‌రెడ్డి, హన్మంతరావు, అంజనేయులు, సత్యనారాయణ, శ్రీనివాస్, మురళీ, వెంకట్‌రెడ్డి, శ్రీనివాసులు, కిష్టయ్య, యాకూబ్, నారాయణ పాల్గొన్నారు.