నల్గొండ

చిన్న జిల్లాల అధికారులు ప్రజలకు చేరువ కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, అక్టోబర్ 18: పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజన లక్ష్యాల అమలుకు అధికార యంత్రాంగం చిన్న జిల్లాల ద్వారా ప్రజలకు మరింత చేరువై సుపరిపాలన అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ కలెక్టర్లకు సూచించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆయన జిల్లా కలెక్టర్లతో మాట్లాడుతూ తెలంగాణ హరితహారం లక్ష్యాల సాధనకు సూక్ష్మ ప్రణాళిక కమిటీలను ఏర్పాటు చేసి రాబోయే సంవత్సర లక్ష్యాల సాధనకు కృషి చేయాలన్నారు. ఇందుకు అవసరమైన నర్సరీలను ఏర్పాటు చేయాలని సూచించారు. హరితహారం లక్ష్యసాధనలో వెనుకబడిన జిల్లాలు తగిన ప్రణాళికలతో గ్రామ స్ధాయి కమిటీల ఏర్పాట్లతో వందశాతం లక్ష్యాలు పూర్తి చేయాలన్నారు. టేకు, ఈత, మామిడి, ఇతర పండ్లు, ఔషద మొక్కలను నర్సరీల్లో పెంచి రోడ్లకు ఇరువైపుల పొడవైన చేట్లను నాటే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. నాటిన మొక్కల సంరక్షణ బాధ్యతలు, నీటి సరఫరా చర్యలపై ప్రభుత్వానికి నివేదిక పంపించాలన్నారు. 2016 సంవత్సరంలో ఇప్పటివరకు 31 కోట్ల మొక్కలు నాటామని, రాబోయే 4 సంవత్సరాల్లో 100 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రభుత్వం తెలంగాణ సమాజాన్ని సిద్దం చేస్తుందన్నారు. ప్రభుత్వం అధికార లక్ష్య సాధనకు కలెక్టర్లు ప్రాధాన్యతనివ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, జేసి నారాయణరెడ్డి, ఏజేసి వెంకట్రావు, డి ఎఫ్ ఒ సుదర్శన్‌రెడ్డి, డి ఆర్ ఒ అంజయ్య, ఆర్ డి ఒ వెంకటాచారి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.