నల్గొండ

స్వచ్ఛ భారత్ నిర్వహణ అందరి బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, అక్టోబర్ 18: స్వచ్ఛ భారత్‌తో పరిసరాలను, కాలనీలను, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుకునే కార్యక్రమాలను నిర్వహించడం ప్రజలందరి బాధ్యతని ఈ కార్యక్రమాల్లో అందరు విధిగా భాగస్వాములై విజయవంతం చేయాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లో ఆయన స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమాల్లో పాల్గొని వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో కలిసి చీపుర్లతో చెత్తను ఊడ్చి తొలగించారు. ప్రతి వారంలో కార్యాలయాల సిబ్బంది విధిగా ఒక రోజు స్వచ్ఛ భారత్ కొనసాగించాలన్నారు. ఈసందర్భంగా కలెక్టరేట్‌లోని వివిధ శాఖల కార్యాయాలను పరిశీలించి ఖాళీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇతర శాఖలను కలెక్టరేట్‌లోకి తరలించే విషయంపై చర్చించారు. కలెక్టర్‌తో పాటు జెసి సి. నారాయణరెడ్డి, ఎజెసి వెంకట్రావు, డిఆర్‌వో అంజయ్యలు చెత్త తొలగింపు పనుల్లో పాల్గొన్నారు. జిల్లా పరిషత్‌లో జరిగిన స్వచ్ఛ భారత్‌లో జడ్పీ సిఈవో మహేందర్‌రెడ్డి, సిబ్బంది, ఇరిగేషన్ కార్యాలయంలో ఎస్‌ఈ ధర్మానాయక్, ఈఈ హామీద్‌ఖాన్, ఆర్‌అండ్‌బి కార్యాలయంలో ఈఈ నరసింహల ఆధ్వర్యంలో పరిసరాలను పరిశుభ్రం చేసి చెత్తను తొలగించారు. ఆయా కార్యక్రమాల్లో జెడిఏ నరసింహరావు, డిప్యూటీ సీఈవో మోహన్‌రావు, ఇన్‌చార్జి డిఈ నాగయ్య, అంజన్‌రెడ్డి, షరీఫ్, పద్మనాభం, చినరాములు, డిఈ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.