నల్గొండ

రైల్వే ఉద్యోగాల పేరుతో టోకరా... నిందితుల అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ రూరల్, ఏప్రిల్ 5: రైల్వే ఉద్యోగాల పేరుతో మోసం చేసి కోటి రూపాయలు వసూలు చేసిన నిందితులను నల్లగొండ పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబందించి మంగళవారం నల్లగొండ డిఎస్పీ సుధాకర్ విలేఖరుల సమావేశంలో నిందితుల వివరాలు వెళ్లడించారు. హైద్రాబాద్ హయత్‌నగర్‌కు చెందిన తెలంగాణ అమర వీరుల కుంటంబాల రాష్ట్ర ఐక్య వేదిక అధ్యక్షులు మేకల రఘురాంరెడ్డి, వరంగల్ జిల్లా సంగెం మండలం పల్లారిగూడకు చెందిన శ్రీ రామోజి భిక్షపతిలు రైల్వే డిపార్డ్‌మెంట్‌లో అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, టికెట్ కలెక్టర్ ఉద్యోగాలిప్పిస్తామని, మే 2015లో వరంగల్‌కు చెందిన వారివద్ద కోటి రూపాయలను వసూల్ చేశారు. వరంగల్ జిల్లాకు చెందిన బాధితుడు వేలుపుల కుమారస్వామి తనకు జరిగిన మోసాన్ని గమనించి పోలీస్‌లకు తెలియజేయగా ఘరానామోసాలకు పాల్పడ్డ రఘురాంరెడ్డిని, రామోజి భిక్షపతిని మంగళవారం నల్లగొండ పట్టణంలోని సూర్యవంశీ కాలనీలో అరెస్ట్ చేసి విచారించారు. రైల్వే ఉద్యోగాల పేరుతో వేలుపుల కుమారస్వామితోపాటు అదే జిల్లాకు చెందిన మహేష్, తీగల రాజు, దొమ్మితి అఖిల్, దొమ్మటి రాజులతోపాటు, మరికొంతమంది వద్ద 18రైల్వే ఉద్యోగాలు, ఒక డ్రగ్ ఇన్స్‌పెక్టర్, రెండు హోంగార్డు ఉద్యోగాల పేరుతో ఒక్కొక్కరి వద్ద ఆరు లక్షల నుండి ఏడున్నర లక్షలు వసూలు చేసి మొత్తం కోటి రూపాయలతో టోకరా వేసి హైద్రాబాద్‌లోని ఉప్పల్‌కు చెందిన కూరపాటి చంద్రమోహన్‌కు చెందిన శ్రీకర్ గ్రాఫిక్స్‌లో లెటర్ ఫ్యాడ్లు తయారు చేసి, దొంగ సంతకాలు పెట్టి రైల్వే బోర్డు సికింద్రాబాద్ పేరుతో అపాయిట్‌మెంట్ ఆర్డర్లు ఇచ్చి మోసం చేసినట్లు డిఎస్పీ తెలిపారు. ఈ మోసాల ద్వారా వచ్చిన డబ్బులతో రఘురాంరెడ్డి హైద్రాబాద్‌లో తన భార్య పేరుతో 60లక్షలతో ఇల్లు, ఎసి కారు, ల్యాప్‌టాప్ కొనుగోలు చేశాడు. భిక్షపతికి ఐదు లక్షలు ఇస్తే అప్పులు కట్టుకున్నాడని, నిందితుడు రఘురాంరెడ్డి వద్ద 80వేల రూపాలయ నగదును, భిక్షపతి వద్ద ఒక సెల్‌ఫోన్‌ను, శ్రీకర్ గ్రాఫిక్స్ వద్ద ఖాళీ పేపర్లు, ప్రింటర్, సిపియును స్వాదీనం చేసుకుని సీజ్ చేసినట్లు డిఎస్పీ వెల్లడించారు. ఈ విలేఖరుల సమావేశంలో టూ టౌన్ సిఐ రవీందర్, ఎస్‌ఐ నాగదుర్గప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.