నల్గొండ

గ్రూప్-2 పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేటటౌన్, అక్టోబర్ 21: గ్రూపు-2 పరీక్షల నిర్వాహణకు పకడ్బంధీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె.సురేంద్రమోహన్ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలో పరీక్ష నిర్వహణ చీఫ్ ఎగ్జామినర్స్, వివిధ కళాశాలల ప్రిన్సిపాల్‌లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలు నవంబర్ 11, 13 తేదీలల్లో నిర్వహించడం జరుగుతుందని జిల్లావ్యాప్తంగా 43పరీక్షా కేంద్రాల్లో 14,966మంది పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. అందులో సూర్యాపేటలో 27కేంద్రాల్లో 8,650, కోదాడలో 16కేంద్రాల్లో 6,316మంది పరీక్ష రాస్తారన్నారు. టిఎస్‌పిఎస్‌సి నిబంధనలు అతిక్రమించిన ఉద్యోగులపై కేసులు నమోదు చేయడంతో పాటు సస్పెండ్ చేయడం జరుగుతుందన్నారు. అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా పరీక్షా కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్దకు విద్యార్థులను చేరవేసేందుకు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే 108వాహనాన్ని పరీక్షకేంద్రం వద్ద అందుబాటులో ఉంచడంతో పాటు పరీక్ష కేంద్రాల సమీపంలో రోడ్లపై సిసి కెమోరాలు అమర్చుతున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించడం జరగదన్నారు. అభ్యర్థుల బంధువులు పరీక్షాకేంద్రాల్లో విధులు నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం పదవ తరగతి వార్షిక పరీక్షలపై సమీక్ష నిర్వహించారు. పదవతరగతి పరీక్షల్లో 100శాతం ఫలితాలు సాధించి జిల్లాకు పేరు తీసుకురావాలన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్దులే చదువుతుంటారని వారికి పరీక్షల పట్ల ఉన్న భయాన్ని పోగొట్టి పరీక్షలకు సన్నదం చేయాలన్నారు. ఈ సందర్భంగా గత సంవత్సరం జిల్లాలో 100శాతం ఫలితాలు సాధించిన 46పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఆయన అభినందించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డి. సంజీవరెడ్డి, డిఈవో వెంకటనర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.