నల్గొండ

హేతుబద్దీకరణ కసరత్తు ఆరంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, అక్టోబర్ 25: నూతన జిల్లాల ఏర్పాటు తర్వాత ప్రభుత్వ విద్యావ్యవస్థను పటిష్టంచేసే చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ చర్యల్లో భాగంగా ఉపాధ్యాయుల హేతుబద్దీకరణ ప్రక్రియను ప్రారంభించింది. గత ఉమ్మడి రాష్ట్రంలో హేతుబద్దీకరణలో లోపాలు జరిగినట్లు గుర్తించి ఈవిడత అత్యంత పకడ్భందిగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం ఇటీవల హైదరాబాద్‌లో అన్ని జిల్లాల విద్యాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన విద్యాశాఖమంత్రి కడియం శ్రీహరి హేతుబద్దీకరణతో పాటు ఖాళీల భర్తీ అంశంపై చర్చించి ఆదేశాలు ఇవ్వడంతో విద్యాధికారులు ఇందుకు సంబంధించిన కసరత్తును చేపడుతున్నారు. హేతుబద్దీకరణ, ఖాళీల గుర్తింపు కోసం గత సెప్టెంబర్ 30వరకు పాఠశాలల వారీగా వివరాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు విద్యాధికారులు ప్రాథమిక, ప్రాధమికోన్నత, ఉన్నత పాఠశాలల వారీగా విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరాలను గుర్తించి నివేధిక రూపొందించారు. గతంలో పలుమార్లు హేతుబద్దీకరణ జరిగిన పూర్తిస్థాయిలో వివరాలు విద్యాశాఖ వద్ద లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. హేతుబద్దీకరణ చేపట్టిన తర్వాత పలుచోట్ల ఖాళీలు, మరికొన్ని చోట్ల విద్యార్థుల సంఖ్య తక్కువగా, ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువగా ఉన్న ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. ఇలాంటివీ పునరావృతం కాకుండా పకడ్బందిగా వివరాలు సేకరించేలా విద్యాశాఖ మార్గదర్శకాలను సూచించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ఉపాధ్యాయుల హేతుబద్దీకరణ ప్రక్రియను చేపడుతుండడంతో ప్రతిష్టాత్మకంగా భావించి ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండేలా సమగ్ర వివరాలను సేకరిస్తున్నారు. జిల్లాల వారీగా ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు, సబ్జెక్టుల వారీగా పోస్టుల వివరాలను సేకరిస్తున్నారు. 2015లో హేతుబద్దీకరణ చేపట్టేందుకు ఏర్పాట్లు చేసినప్పటికి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టే యోచనతో వాయిదా వేశారు.
జిల్లాలో 292 పోస్టుల ఖాళీ
హేతుబద్దీకరణ కోసం సేకరించిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లాలో 292 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించి ప్రభుత్వానికి నివేధిక అందించారు. జిల్లావ్యాప్తంగా 1,013 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా అందులో 91,0915 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 4,279 ఉపాధ్యాయ పోస్టులు కేటాయించగా అందులో 3,987 మంది విధులు నిర్వహిస్తున్నారు. ఖాళీగా ఉన్న 292 పోస్టుల్లో 28 గెజిటెడ్ ప్రధానోపాధ్యాయ, 57 స్కూల్ అసిస్టెంట్స్ (సోషల్), 40 ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎంలు, 38 ఎస్జిటి, 24స్కూల్ అసిస్టెంట్(జీవశాస్త్రం), 22స్కూల్ అసిస్టెంట్(తెలుగు), 23లాంగ్వేజ్ పండిట్(తెలుగు), 8స్కూల్ అసిస్టెంట్(మ్యాథ్స్), 3స్కూల్ అసిస్టెంట్(్ఫజికల్‌సైన్స్), 5స్కూల్ అసిస్టెంట్(ఇంగ్లీష్) 13స్కూల్ అసిస్టెంట్(హిందీ), 2స్కూల్ అసిస్టెంట్(్ఫజికల్‌డైరెక్టర్), 14లాంగ్వేజ్ పండిట్(హిందీ), 15 పిఈటి పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
డిఎస్సీకి ఈ నివేదికే కీలకం
వచ్చే వేసవిలో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేలా చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం ఓ వైపు హేతుబద్దీకరణ, మరో వైపు ఖాళీల గుర్తింపునకు ప్రస్తుతం సేకరించే వివరాలే కీలకంగా మారనున్నాయి. ఈ ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా విద్యాధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినట్లు తెలుస్తోంది. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఇచ్చే వివరాలను ప్రామాణికంగా భావించకుండా పాఠశాలలకు వెళ్లి వాస్తవ వివరాలను సేకరించి సమగ్ర వివరాలను అందించాలని ప్రభుత్వం ఆదేశించింది.
ప్రభుత్వ ఆదేశాల మేరకు వివరాల సేకరణ
* డిఈవో బి.వెంకటనర్సమ్మ
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో పాఠశాలలకు సంబంధించిన సమగ్ర వివరాలను సేకరిస్తున్నాం. ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల వివరాలను నివేధించాం. పకడ్బందీగా వివరాలు సేకరించి నివేధిస్తాం.