నల్గొండ

సంక్షేమ పథకాల ఆశచూపి వంచిస్తున్న సిఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిట్యాల, అక్టోబర్ 28: దళితులను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి సంక్షేమ పథకాలతో అభివృద్ధి చేస్తామని ఆశచూపి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వంచిస్తున్నారని భాజపా దళితమోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి గోలి ప్రభాకర్ విమర్శించారు. మండల కేంద్రంలో భాజపా ఆధ్వర్యంలో శుక్రవారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో గోలి ప్రభాకర్ ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడారు. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితుల సంక్షేమానికి పాటుపడతామని భూమిలేని కుటుంబాలకు 3ఎకరాల భూపంపిణీ చేస్తామని సిఎం కెసిఆర్ చెప్పి కొంతమందికి భూపంపిణీ చేసి చేతులు దులుపుకుందన్నారు. భూపంపిణీ చేస్తామని హామీనిచ్చిన సిఎం కెసిఆర్ కేవలం ప్రకటనలకే పరిమితమైనారని దళితులను మోసగిస్తున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2లక్షల 91వేల దళిత కుటుంబాలు భూమిలేకుండా ఉన్నాయని సిఎం కెసిఆర్ భూపంపిణీని 2020 కుటుంబాలకు భూపంపిణీని చేసి చేతులు దులుపుకున్నారని మిగిలిన కుటుంబాల పరిస్థిత ఏంటని ప్రశ్నించారు. తెరాస ప్రభుత్వం ప్రచారార్భాటాలతోనే కాలం వెల్లదీస్తుందని ఇచ్చిన హామీలను నెరవేర్చడాన్ని విస్మరించడం తెరాస ప్రభుత్వానికే చెల్లిందన్నారు. దళితులకు 3ఎకరాల భూపంపిణీ చేసేందుకు ప్రభుత్వానికి ఇంకెనే్నళ్ళు పడుతుందో సిఎం కెసిఆర్ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు రాయితీ రుణాలను మంజూరు చేసి ఆర్ధికంగా ఆదుకుంటామని చెప్పిందని ఎంతో మంది రుణాలకు ఎంపికై రాయితీల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. 42వేల నిరుద్యోగ కుటుంబాలు రాయితీల కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాయన్నారు. దళితులకు 3ఎకరాల భూపంపిణీని చేపట్టాలని, నిరుద్యుగులకు సంబంధించిన రాయితీలను తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో భాజపా నియోజకవర్గ కన్వీనర్ పాల్వాయి భాస్కర్‌రావు, జిల్లా ప్రచారకార్యదర్శి గోశిక వెంకటేశం, మండల అధ్యక్షకార్యదర్శులు మాస శ్రీనివాస్, పల్లె వెంకన్న, పొట్లపల్లి నర్సింహ, వెల్ది రాఘవరెడ్డి, గంజి గోవర్ధన్ పాల్గొన్నారు.