నల్గొండ

రూ.35 వేల కోట్లతో సంక్షేమ పథకాలు అమలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నకిరేకల్, నవంబర్ 4: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.35వేల కోట్లతో పలు పథకాలను అమలుచేస్తూ ప్రజాసంక్షేమానికి పెద్దపీఠ వేసిందని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని స్థానిక శాసనసభ్యులు వేముల వీరేశం నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. భారతదేశ చరిత్రలోనే నెంబర్ 1 ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కేంద్ర ప్రభుత్వమే నిర్ణయించిందన్నారు. ప్రభుత్వం డబుల్‌బెడ్ రూం, పించన్‌లు, కళ్యాణ లక్ష్మి, షాధీముబారక్, మిషన్ భగీరథ వంటి పథకాలను ప్రవేశపెట్టి ముందుకు సాగుతుందన్నారు. రాష్టవ్య్రాప్తంగా 40వేల చెరువులుండగా ప్రస్తుతం 20వేల చెరువులు పొంగి పొర్లుతున్నాయని చెప్పారు.