నల్గొండ

48 గంటల్లో చెల్లింపులు ఉత్తిమాటే !

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, నవంబర్ 7: పంటలు సాగు ప్రారంభించింది మొదలు పండించిన పంటలను విక్రయించుకునేంత వరకు అన్నదాతలకు కష్టాలు తప్పడంలేదు. ఈ సీజన్‌లో ధాన్యం విక్రయించిన రైతులకు కొనుగోళ్లు చేసిన 48గంటల్లోనే చెల్లింపులు చేస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా చేసిన ప్రకటన రైతాంగంలో ఆశలు రేకెత్తించగా ఆచరణలో అమలుకు నోచుకోకపోవడంతో చెల్లింపుల కోసం పడిగాపులు పడాల్సిన దైన్యం నెలకొంది. జిల్లావ్యాప్తంగా కొనుగోలుకేంద్రాలు ప్రారంభించి పక్షంలో రోజులు గడుస్తున్న నేటికి ఎక్కడా విక్రయించిన ధాన్యానికి పైసా కూడ చెల్లించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ సీజన్‌లో కొత్తగా ఏర్పాటైన సూర్యాపేట జిల్లాలో 25 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసేలా చర్యలు తీసుకున్నారు. జిల్లావ్యాప్తంగా 40వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రూ.40కోట్ల చెల్లింపులతో కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఐకేపి, పిఏసిఎస్‌ల ద్వారా మొత్తం 25కేంద్రాలను ఏర్పాటుచేయగా ఇప్పటి వరకు ఐకేపి ఆధ్వర్యంలో 9, పిఏసిఎస్‌ల ఆధ్వర్యంలో 16 కొనుగోలు కేంద్రాలను ఏర్పాట్లు చేశారు. కాగా గత నెల 21నుండి జిల్లావ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో ఐకేపి కేంద్రాలు ప్రారంభించారు. 13కేంద్రాలకు అమ్మకానికి ధాన్యం వస్తుండగా ఆయకట్టు ప్రాంతమైన కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల పరిధిలో వరికోతలు ప్రారంభం కాకపోవడంతో అక్కడ ఇంకా కేంద్రాలను ప్రారంభించలేదు. గత పక్షం రోజులుగా మిగిలిన ప్రాంతాల్లో కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. 15రోజుల్లోనే రెండు వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల వద్ద నుండి కొనుగోళ్లు చేశారు. మొత్తం 400మంది రైతుల నుండి ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయగా రూ. 3కోట్లకు పైగా ఇందుకు సంబంధించి రైతులకు డబ్బులు చెల్లించాల్సి ఉంది. పంటల సాగుకోసం అధిక వడ్డికి అప్పులు తెచ్చిన రైతులు ప్రైవేట్ వ్యాపారులకు ధాన్యం విక్రయిస్తే 10రోజులకు డబ్బులు చెల్లిస్తారని అంతే కాకుండా కమీషన్‌ను మినహాయించుకుంటారని భావించి ప్రభుత్వం 48 గంటల్లోనే చెల్లింపులు చేస్తామన్న ప్రకటనతో ఐకేపి కేంద్రాల్లోనే అధికంగా ధాన్యాన్ని విక్రయించారు. అయితే ప్రభుత్వ ప్రకటన కార్యరూపం దాల్చడం లేదు. తాము ధాన్యం విక్రయించి పక్షం రోజులు దాటుతున్న ఇంకా డబ్బులు రాకపోవడంతో నానా ఇబ్బందులకు గురవుతున్నారు. ఆన్‌లైన్ విధానంలో ట్యాబ్‌ల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఈ ప్రక్రియ కొనసాగకా రైతుల ఖాతాల్లో ఈడబ్బు జమకావడం లేదు. రాష్టవ్య్రాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందని అధికారులు పేర్కొంటున్నారు.