నల్గొండ

సంక్షేమంలో మనమే టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, నవంబర్ 8: అన్ని వర్గాల ప్రజలకు లబ్దిచేకూర్చేలా వినూత్న సంక్షేమ పథకాలను అమలుచేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర విద్యుత్, దళిత అభివృద్దిశాఖల మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని పశుసంవర్ధక కార్యాలయంలో జిల్లా పరిధిలోగల గొర్రెల పెంపంకదారుల సంఘాలకు జాతీయ సహకార అభివృద్దిసంస్ధ(ఎన్‌సిడిసి) ద్వారా మంజూరైన ఉ.1.33కోట్ల రుణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కొత్త రాష్ట్రాన్ని ఉద్యమనేత అయిన కెసిఆర్ ద్వారానే అభివృద్ది చెందుతుందనే నమ్మకంతో టిఆర్‌ఎస్‌కు అధికారం కట్టబెట్టారన్నారు. ఉద్యమనేతగా తెలంగాణ ప్రాంత ప్రజల జీవన పరిస్థితులు, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయాలపై అవగాహన ఉన్న రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుడుతూ బంగారు తెలంగాణకు బాటలు వేస్తున్నారన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హమీలన్నింటిని అమలుచేయడంతో పాటు హమీలు ఇవ్వకుండానే కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, బడి పిల్లలు, హస్టల్ విద్యార్ధులకు సన్నబియ్యం ద్వారా భోజనం అందిచే గొప్ప పథకాలను అమలుచేస్తున్నారన్నారు. మిషన్ కాకతీయద్వారా సాగునీటి వనరులను అభివృద్ది చేయడంతో పాటు మిషన్ భగీరధ ద్వారా ఇంటింటికి మంచినీటిని అందించే పథకాలను ప్రారంభించడం జరిగిందన్నారు. తెలంగాణ ఏర్పడితే చీకట్లు తప్పవన్న విమర్శలు వ్యక్తంకాగా నేడు తమ పాలనలో నిరంతర విద్యుత్ అందించడమే కాకుండా వ్యవసాయానికి 9గంటల పాటు పగటిపూట విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామన్నారు. సమాజంలోని చిట్టచివర ఉన్న వారికి సైతం సంక్షేమ పథకాలను అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నామన్నారు. కునరిల్లుతున్న చేతివృత్తులు, కుల వృత్తిదారులకు చేయూతనందించేలా పథకాలను అమలు చేస్తున్నామన్నారు. మృత్స్య కార్మికులకు ఉచితంగా చేపపిల్లలను అందిస్తున్నామని, అదేవిధంగా గొర్రెలకాపారులకు కోట్లాది రూపాయల రుణాలను అందిస్తూ వారికి భరోసాను కల్పిస్తున్నట్లు చెప్పారు.