నల్గొండ

ముగిసిన గ్రూప్-2 పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, నవంబర్ 13: గ్రూప్ 2పరీక్షల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన మూడు, నాల్గవ ప్రశ్న పత్రాల పరీక్షలు నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ప్రశాంతంగా ముగిశాయి. నల్లగొండ జిల్లా పరిధిలోని నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండలలో 110కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు 41,311మంది అభ్యర్థులకుగాను ఉదయం జరిగిన మూడవ పరీక్షకు 29,159మంది హాజరుకాగా 12,512మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 29,168మంది హాజరుకాగా, 12,413మంది గైర్హాజరయ్యారు. సూర్యాపేట జిల్లా పరిధిలో ఉదయం జరిగిన పరీక్షకు 14,966మందికిగాను 5,959మంది హాజరుకాగా 9009మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం పరీక్షకు 5,958మంది హాజరుకాగా 9008మంది గైర్హాజరయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉదయం పరీక్షకు 13,204మందికిగాను 7,916మంది హాజరుకాగా, 5,288గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం పరీక్షకు 7,909మంది హాజరుకాగా 5,295మంది గైర్హాజరయ్యారు. నల్లగొండలో పరీక్ష కేంద్రాలను ఇన్‌చార్జి కలెక్టర్ సి.నారాయణరెడ్డి, పోచంపల్లిలో యాదాద్రి భువనగిరి కలెక్టర్ అనితారామచంద్రన్‌లు తనిఖీ చేశారు. పరీక్షలు విజయవంతంగా ప్రశాంతంగా ముగిశాయని వారు తెలిపారు.
కోదాడ: కోదాడ పట్టణంలోని 16 పరీక్షాకేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన గ్రూప్-2 పరీక్షకు ఈనెల 11వ, తేదిన జరిగిన పరీక్ష హాజరుకంటే ఇంకా తక్కువమంది నిరుద్యోగులు హాజరుకావడం విశేషం. పట్టణంలో ఏర్పాటు చేసిన 16 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 6316 మంది నిరుద్యోగులు పరీక్షకు హాజరుకావాల్సి వుండగా ఉదయం జరిగిన పరీక్షకు 1613 మంది నిరుద్యోగులు, మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 1611 మంది నిరుద్యోగులు మాత్రమే హాజరై పరీక్షరాశారు. కోదాడలో గ్రూప్-2 పరీక్ష హాజరుశాతం కేవలం 26 శాతం నమోదు అయింది.
ప్రశాంతంగా గ్రూప్-2 పరీక్ష
* రెండవ రోజు 39.81 శాతం హాజరు
* జిల్లాలో 9008 మంది అభ్యర్థుల గైర్హాజర్
* సూర్యాపేటలో 50.24, కోదాడలో 25.52 శాతం
సూర్యాపేట, నవంబర్ 13: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం తొలిసారిగా నిర్వహిస్తున్న గ్రూప్-2 పరీక్షల్లో ఆదివారం రెండవరోజు నిర్వహించిన పరీక్షల్లో సూర్యాపేట జిల్లాలో 39.81శాతం హాజరు నమోదు అయింది. ఈనెల 11న నిర్వహించిన తొలిరోజు పరీక్షలకు 41.40శాతం మంది అభ్యర్థులు హాజరుకాగా రెండవరోజు అంతకంటే తక్కువగా అభ్యర్థులు పరీక్షలు రాశారు. జిల్లాలోని సూర్యాపేట, కోదాడలల్లో పరీక్షల నిర్వహణ కోసం 43పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేయగా మొత్తం 14,966మంది అభ్యర్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా అందులో 5,958మంది అభ్యర్థులు మాత్రమే పరీక్షలు రాయగా 9,008మంది అభ్యర్థులు గైర్హాజర్ అయ్యారు. జిల్లాకేంద్రంలో ఏర్పాటుచేసిన 27పరీక్షా కేంద్రాల్లో మొత్తం 8,650మంది అభ్యర్థులకు గాను 4,346మంది పరీక్షలు రాయగా 4,304మంది గైర్హాజర్ అయ్యారు. జిల్లాకేంద్రంలో 50.24శాతం మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు.
అదే విధంగా డివిజన్ కేంద్రమైన కోదాడలో ఏర్పాటుచేసిన 16 పరీక్షా కేంద్రాల్లో 6,316మంది అభ్యర్థులకు గాను కేవలం 1,612మంది మాత్రమే పరీక్షలు రాయగా 4,704మంది అభ్యర్థులు హాజరుకాలేదు. దీంతో కోదాడలో అత్యల్పంగా 25,52శాతం మాత్రమే హాజరు నమోదు అయింది. మొదటిరోజు పరీక్షకు కోదాడలో 26శాతం మంది అభ్యర్థులు హాజరుకాగా రెండవరోజు ఒకశాతం మంది తక్కువగా పరీక్షలు రాసినట్లు అధికారులు వివరించారు. మొదటిరోజు పరీక్ష రాస్తున్న అభ్యర్థుల బయోమెట్రిక్ నమోదులో ఇబ్బందులు ఎదురుకావడంతో అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టడంతో ఆదివారం నిర్వహించిన రెండవరోజు పరీక్షల్లో 100శాతం నమోదుచేశారు. జాయింట్ కలెక్టర్ డి.సంజీవరెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి గోపాల్‌రావులు పట్టణంలోని పలు పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. అదే విధంగా జిల్లా ఎస్పి పరిమళ హనా నూతన్ పట్టణంలోని పలు పరీక్షా కేంద్రాలను సందర్శించి భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. పరీక్షల రాసేందుకు జిల్లాలోపి పలు ప్రాంతాల నుండి అభ్యర్థులు వేల సంఖ్యలో తరలిరావడంతో పట్టణంలోని బస్టాండ్‌లు, హోటళ్లు కిక్కిరిసిపోయాయి.