నల్గొండ

విజ్ఞాన కేంద్రాలు గ్రంథాలయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, నవంబర్ 14: సమాజ ప్రస్థానంలో గ్రంథాలయాలు విజ్ఞాన కేంద్రాలుగా, చైతన్యదీపికలుగా కొనసాగుతు విద్యార్థులకు, ప్రజలకు విజ్ఞానాన్ని అందిస్తున్నాయని ఇన్‌చార్జి కలెక్టర్, జిల్లా గ్రంథాలయ సంస్థ పర్సన్ ఇన్‌చార్జి సి.నారాయణరెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 49వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడారు. మంచి పుస్తకానికి మించిన నేస్తం లేదని, పుస్తక పఠనం ద్వారా విద్యార్థుల్లో విజ్ఞాన వికాసంతో పాటు సత్‌ప్రవర్తనకు పునాదులు పడి వ్యక్తిత్వ వికాసం పెంపొందుతుందన్నారు. గ్రంథపఠనం అలవాటు చేసుకుని విజ్ఞానాభివృద్ధికి గ్రంథాలయాలు సందర్శించి విద్యార్థులు, నిరుద్యోగులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహానీయుల జీవిత విశేషాలు, చరిత్రలతో కూడిన పుస్తకాలతో పాటు పోటీ పరీక్షల పుస్తకాలు కూడా అందుబాటులో ఉన్నందునా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వారోత్సవాల్లో భాగంగా నిర్వహించే పుస్తక ప్రదర్శన, వ్యాసరఛన, చిత్రలేఖనం, ఉపన్యాస, క్విజ్, పాటల పోటీలతో పాటు వివిధ అంశాలపై చర్చలు, పోటీల్లో విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. వారోత్సవాల విజయవంతానికి సాహితీవేత్తలు, పుస్తక ప్రియులు చరుకుగా పాల్గొనాల్సిన అవసరముందన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ కార్యదర్శి పి.శుక్లాదేవి, విద్యావేత్త కొండకింది చినవెంకట్‌రెడ్డి, జిల్లా రఛయితల వేదిక అధ్యక్షులు మేరెడ్డి యాదగిరిరెడ్డి, కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, డిపిఆర్‌వో మహ్మద్ ముర్తజా, అసిస్టెంట్ లైబ్రెరియన్ కట్టా నాగయ్య, సీనియర్ అసిస్టెంట్ పి.నాగేశ్వర్‌రావు, నిర్మలాదేవి, వి.నర్సయ్య, వి.రవికుమార్, సిబ్బంది, పాఠకులు, విద్యార్థులు పాల్గొన్నారు.